వాట్సాప్‌లో ఇలా చేస్తే అకౌంట్ బ్లాక్ అవుతుంది!
వాట్సాప్ అకౌంట్ వాడేటప్పుడు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండడం అవసరమని వాట్సాప్ సూచిస్తోంది. యూజర్ల ప్రైవసీ, సెక్యూరిటీకి సంబంధించి కొన్ని విషయాల్లో వాట్సాప్ నిబంధనలు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయి.
వాట్సాప్ అకౌంట్ వాడేటప్పుడు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండడం అవసరమని వాట్సాప్ సూచిస్తోంది. యూజర్ల ప్రైవసీ, సెక్యూరిటీకి సంబంధించి కొన్ని విషయాల్లో వాట్సాప్ నిబంధనలు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వాట్సాప్ మంత్లీ యూజర్ సెక్యూరిటీ నివేదిక ప్రకారం.. ఆగస్టు నెలలో మనదేశంలో 2.3 మిలియన్ల యూజర్లను వాట్సాప్ బ్లాక్ చేసింది. అలాంటి బ్లాక్ లిస్ట్‌లో మీ నెంబర్ ఉండకూడదంటే కొన్ని జాగ్రత్తలుతీసుకోవడం అవసరం. అవేంటంటే..
ఫేక్ వార్తలు, స్పామ్ మెసేజెస్‌ను కంట్రోల్ చేసేందుకు వాట్సాప్ తరచుగా సెక్యూరిటీ అప్‌డేట్స్, ప్రైవసీ అప్‌డేట్స్‌ను పంపిస్తుంటుంది . వాటిని యాక్సెప్ట్ చేయకుండా యాప్ వాడుతున్నట్టయితే ఎప్పుడైనా వాట్సాప్ పనిచేయడం ఆగిపోవచ్చు. కాబట్టి వాట్సాప్ పంపే సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇన్‌స్టాల్ చేసుకోవడం లేదా ప్రైవసీ రూల్స్‌ను యాక్సెప్ట్ చేయడం చేస్తుండాలి.
వాట్సాప్‌లో ఏదైనా వార్త వచ్చినప్పుడు అది నిజమైనదా కాదా అనేది తెలియకుండా ఫార్వార్డ్ చేయకూడదు. ఫేక్ న్యూస్‌ను ఫార్వార్డ్ చేసేవాళ్ల లిస్ట్‌లో తరచూ మీ అకౌంట్ కూడా కనిపిస్తుంటే వాట్సాప్ మీ అకౌంట్‌ను బ్లాక్ చేసే అవకాశం ఉంది.
వాట్సాప్ లో ఆటోమేటెడ్ మెసేజ్‌లు లేదా బల్క్ మెసేజ్‌లను పంపితే మీ నెంబర్ స్పామ్ లిస్ట్‌లో చేరే ప్రమాదముంది. కాబట్టి అవసరం లేని మెసేజ్‌ల జోలికి వెళ్లొద్దు.
వాట్సా్ప్‌లో ఎప్పుడూ దుర్బాషలాడే మెసేజ్‌లు పంపకూడదు. అలాచేస్తే అవతలి యూజర్ మీ వాట్సాప్‌లో నెంబర్‌ను రిపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఇలాంటి రిపోర్ట్‌లు ఎక్కువైతే మీ అకౌంట్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది.
ఫేక్ న్యూస్‌లు పంపే వాట్సా్ప్ గ్రూపులు, బెట్టింగ్ గ్రూపులు లాంటివాటిలో ఎప్పుడూ జాయిన్ అవ్వకూడదు. అలాంటి గ్రూపులను ఎక్కువమంది రిపోర్ట్ చేస్తుంటారు. అలా చేసినప్పుడు అందులో ఉన్నమెంబర్స్‌పై వాట్సాప్ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
అనుకోకుండా ఎప్పుడైనా మీ వాట్సాప్ అకౌంట్ బ్యాన్ అయితే ఈమెయిల్ ద్వారా వాట్సాప్‌ను సంప్రదించొచ్చు. ఒకసారి మీ అకౌంట్‌ను రివ్యూ చేయమని కోరవచ్చు.