వివో నుంచి రెండు ఫ్లాగ్‌షిప్ ఫోన్లు! ఫీచర్లు ఇవే..
వివో ఎక్స్100 సిరీస్‌లో భాగంగా వివో ఎక్స్100 అల్ట్రా, వివో ఎక్స్100ఎస్, వివో ఎక్స్100ఎస్ ప్రో అను మూడు ఫోన్లు వచ్చేవారం ఇండియాలో రిలీజ్ అవ్వనున్నాయి.
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో నుంచి కొత్త సిరీస్ లాంఛ్ అవ్వబోతోంది. ‘వివో ఎక్స్100’ పేరుతో రాబోతున్న ఈ సిరీస్‌లో మూడు ఫోన్లు ఉండబోతున్నాయి. వీటి ఫీచర్లు, ధర వివరాల్లోకి వెళ్తే..
వివో ఎక్స్100 సిరీస్‌లో భాగంగా వివో ఎక్స్100 అల్ట్రా, వివో ఎక్స్100ఎస్, వివో ఎక్స్100ఎస్ ప్రో అను మూడు ఫోన్లు వచ్చేవారం ఇండియాలో రిలీజ్ అవ్వనున్నాయి. ఇవి ఫ్లాగ్‌షిప్ రేంజ్‌లో హై ఎండ్ ఫీచర్లతో ఉండబోతున్నాయి.
వివో ఎక్స్100 అల్ట్రా.. ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ఎస్‌వోసీ ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ వెర్షన్ 14 పై రన్ అవుతుంది. ఇందులో 200 మెగా పిక్సె్ల్ ‘జిస్’ కెమెరా ఉండనుంది. అలాగే మరో రెండు 50 ఎంపీ కెమెరాలు, ముందువైపు మరో 50 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉండనున్నాయి. ఇందులో 6.7 ఇంచెస్ ఎల్‌టీపీఓ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఉండనుంది. ఇది 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌ను సపోఎర్ట్ చేస్తుంది. ఇందులో 5400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. లేటెస్ట్ బ్లూటూత్, వైఫై, అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ వంటి ఫీచర్లున్నాయి.
ఇకపోతే వివో ఎక్స్100ఎస్, వివో ఎక్స్100ఎస్ ప్రో మొబైల్స్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ ప్రాసెసర్‌ను అమర్చారు. ప్రాసెసర్ మినహాయించి మిగతా ఫీచర్లన్నీ ఒకే విధంగా ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్లుమూడు కలర్ ఆప్షన్లలో లభ్యమవుతాయి. మూడు మోడల్స్‌లో16జీబీ ర్యామ్, 1టీబీ స్టోరేజ్ వరకూ రకరకాల కాన్ఫిగరేషన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక ధరల విషయానికొస్తే.. వివోఎక్స్100 అల్ట్రా 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 77,500 ఉండొచ్చు. వివో ఎక్స్ 100ఎస్ 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 46,000 ఉండొచ్చు. అలాగే వివో ఎక్స్100ఎస్ ప్రో ధర రూ. 57,000 ఉండొచ్చు. వివో ఎక్స్ 100 ఎస్ మోడల్స్ మే 17 నుంచి, అల్ట్రా మోడల్ మే 28 నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి.