Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Tuesday, May 20
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Health & Lifestyle

    శరీరం ఉబ్బిందా? నీటి బరువు కావొచ్చు!

    By Telugu GlobalMay 7, 2024Updated:March 29, 20252 Mins Read
    శరీరం ఉబ్బిందా? నీటి బరువు కావొచ్చు!
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    శరీరంలో కొవ్వు శాతం పెరగడం కారణంగా లావుగా మారడం, బరువు పెరగడం సహజం. అయితే కొన్ని సందర్భాల్లో శరీరంలో నీటి శాతం పెరగడం మూలాన కూడా బరువు పెరుగుతుంటారు. దీన్నే ‘ఎడెమా’ లేదా ‘వాటర్ వెయిట్’ అంటారు. ఇది మామూలు ఒబెసిటీకి భిన్నంగా ఉంటుంది. దీనికై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చంటే..

    శరీరంలో 70 శాతం నీరే ఉంటుందని మనకు తెలుసు. ఆరోగ్యంగా ఉండేందుకు తగినన్ని నీళ్లు తాగడం కూడా ఎంతో అవసరం అని డాక్టర్లు చెప్తుంటారు. అయితే కొన్నిసార్లు శరీరం అవసరమైన దానికంటే ఎక్కువ నీటిని నిల్వ చేసుకుంటుంది. దీన్నే ఎడెమా అంటారు. దీనివల్ల పలు అవయవాల పనితీరు దెబ్బతింటుంది. కాబట్టి వీలైనంత త్వరగా దీన్ని గుర్తించి సమస్యకు చెక్ పెట్టాలి.

    శరీరం నీటిని ఎక్కువగా నిల్వ చేసుకున్నప్పుడు కాళ్లు, చేతులు ఉబ్బినట్లుగా అనిపిస్తాయి. దీన్ని నార్మల్ ఒబెసిటీలా తేలిగ్గా తీసుకోకూడదు. శరీరంలో నీరు చేరడం కారణంగా కిడ్నీలు దెబ్బతింటాయి. కండరాలు బలహీనపడతాయి. మామూలు ఒబెసిటీతో పోలిస్తే దీంతో ఎక్కువ నష్టాలు ఉంటాయి. కాబట్టి శరీరం ఉబ్బినట్టు కనిపిస్తుంటే వెంటనే నీరు పెరిగిందేమో టెస్ట్ చేయించుకోవాలి.

    శరీరంలో సోడియం కటెంట్ పెరగడం ద్వారా అదనంగా నీరు వచ్చి చేరుతుంది. కాబట్టి ఎడెమాను తగ్గించుకునేందుకు శరీరంలో సోడియం శాతాన్ని తగ్గించాల్సి ఉంటుంది. అంటే ఆహార పదార్థాల్లో ఉప్పుని బాగా తగ్గించాలి. ఎడెమా ఉన్నవాళ్లు కొన్నాళ్లు ఉప్పు లేని ఆహారాలు తీసుకుంటే మంచిది. అలాగే ఫాస్ట్ ఫుడ్స్, చిప్స్ జోలికి పోకూడదు.

    శరీరంలో సోడియం కంటెంట్ తగ్గించుకునేందుకు పొటాషియం హెల్ప్ చేస్తుంది. పొటాషియం తీసుకోవడం ద్వారా శరీరంలోని మినరల్స్ బ్యాలెన్స్ అవుతాయి. అరటిపండ్లు, ఆకుకూరలు, అవకాడో, చిలగడదుంపలు వంటివి తీసుకోవడం ద్వారా పొటాషియం కంటెంట్ పెంచుకోవచ్చు.

    శరీరంలో నీరు చేరిన వారు హై క్యాలరీ ఫుడ్స్‌ను తీసుకోకూడదు. రైస్, బ్రెడ్ వంటివి తగ్గించి ఫైబర్ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవడం ద్వారా శరీరంలో షుగర్ లెవల్స్ పెరిగి నీరు మరింత నిల్వ ఉండే అవకాశం ఉంది.

    ఇకపోతే శరీరంలో నీటి శాతం పెరిగింది కదా అని నీటిని తాగడం తగ్గించకూడదు. అదనంగా చేరిన నీటి శాతం తగ్గాలంటే రక్తప్రసరణ బాగా జరగాలి. దీనికోసం నీరు తగినంత తాగుతుండాలి. అలాగే నీటి శాతం ఉన్న ఆహారాలు తీసుకుంటుండాలి. దీంతోపాటు శారీరక శ్రమ కూడా ముఖ్యమే. వ్యాయామం చేయడం ద్వారా చెమట పట్టి అదనపు నీరు బయటకు పోతుంది.

    Water Weight What is Edema
    Previous Articleఅకౌంట్ రిస్ట్రిక్షన్, ఈవెంట్ ప్లానింగ్.. వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు!
    Next Article వివో నుంచి రెండు ఫ్లాగ్‌షిప్ ఫోన్లు! ఫీచర్లు ఇవే..
    Telugu Global

    Keep Reading

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    మహిళల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లక్షణాలు

    నిద్ర లేమి సమస్య మహిళలకే ఎక్కువ.. ఎందుకంటే

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.