Telugu Global
Science and Technology

శాంసంగ్ ఎమ్35 లాంఛ్! తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ ఫీచర్స్!

శాంసంగ్ నుంచి రీసెంట్‌గా బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్ లాంఛ్ అయింది. గెలాక్సీ ఎమ్ సిరీస్‌లో భాగంగా ‘శాంసంగ్ ఎమ్35 5జీ (Samsung Galaxy M35 5G)’ పేరుతో ఇండియాలో ఈ ఫోన్ లాంఛ్ అయింది.

శాంసంగ్ ఎమ్35 లాంఛ్! తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ ఫీచర్స్!
X

శాంసంగ్ నుంచి రీసెంట్‌గా బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్ లాంఛ్ అయింది. గెలాక్సీ ఎమ్ సిరీస్‌లో భాగంగా ‘శాంసంగ్ ఎమ్35 5జీ (Samsung Galaxy M35 5G)’ పేరుతో ఇండియాలో ఈ ఫోన్ లాంఛ్ అయింది. జులై 20 నుంచి సేల్‌కు రెడీ అవుతున్న ఈ ఫోన్‌లో ఏయే స్పెసిఫికేషన్స్ ఉన్నాయంటే..

శాంసంగ్ గెలాక్సీ ఎమ్‌35 ఫోన్.. ఎగ్జినోస్ 1380 ప్రాసెసర్‌‌పై పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ వన్ యూఐపై రన్ అవుతుంది. ఇందులో 6.6 అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. స్క్రీన్‌కు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్+ ప్రొటెక్షన్ ఉంటుంది.

శాంసంగ్ గెలాక్సీ ఎమ్35 మొబైల్ కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ సెన్సర్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సర్ ఉంటాయి. ముందువైపు 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. అలాగే ఈ మొబైల్‌లో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. బాక్స్‌లో ఛార్జర్ ఉండదు. సెపరేట్‌గా కొనుక్కోవాల్సి ఉంటుంది.

ఈ మొబైల్‌లో డాల్బీ అట్మాస్ స్టీరియో స్పీకర్లతో పాటు డ్యూయల్ నానో సిమ్ సపోర్ట్, వై-ఫై6, బ్లూటూత్ 5.3, ఓటీజీ సపోర్ట్ వంటి ఫీచర్లుంటాయి. ఇందులో శాంసంగ్ నాక్స్ సెక్యూరిటీ, ట్యాప్ అండ్ పే వంటి స్పెషల్ ఫీచర్‌లు, నాలుగేళ్ల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, ఐదేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ కూడా వస్తాయి.

శాంసంగ్ గెలాక్సీ ఎమ్35.. 6జీబీ+ 128జీబీ బేస్ వేరియంట్ ధర రూ. 19,999, 8జీబీ+ 128జీబీ వేరియంట్ ధర రూ. 21,499, 8జీబీ + 256జీబీ వేరియంట్‌ ధర రూ. 24,299 గా ఉన్నాయి. బ్యాంక్ కార్డ్‌లపై రూ. 2,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్, లాంఛింగ్ ఆఫర్ కింద రూ. 1,000 డిస్కౌంట్ పొందొచ్చు. మొబైల్ డేబ్రేక్ బ్లూ, మూన్‌లైట్ బ్లూ, థండర్ గ్రే అనే మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

First Published:  18 July 2024 10:51 AM GMT
Next Story