Samsung Galaxy A05s | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ (Samsung) గత నెలలో తన శాంసంగ్ గెలాక్సీ ఏ05ఎస్ (Samsung Galaxy A05s) ఫోన్ ఆవిష్కరించింది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 680 చిప్‌సెట్, 25 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వచ్చింది. గతేడాది అక్టోబర్‌లో ఆవిష్కరించిన శాంసంగ్ గెలాక్సీ ఏ04ఎస్ ఫోన్ కొనసాగింపుగా శాంసంగ్ గెలాక్సీ ఏ05ఎస్ ఫోన్ వచ్చింది. తొలుత సింగిల్ రామ్ విత్ స్టోరేజీ వేరియంట్‌గా వచ్చిన శాంసంగ్ గెలాక్సీ ఏ05ఎస్ ఫోన్ కొత్త ర్యామ్ కం స్టోరేజీ ఆప్షన్‌తో తక్కువ ధరకే ఆవిష్కరించింది.
గత అక్టోబర్‌లో ఆవిష్కరించినప్పుడు శాంసంగ్ గెలాక్సీ ఏ05ఎస్ (Samsung Galaxy A05s) ఫోన్ 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ధర రూ.14,999. ఇప్పుడు తాజాగా మార్కెట్లో ఆవిష్కరించిన న్యూ 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.13,999లకే లభిస్తుంది. బ్లాక్, లైట్ గ్రీన్, లైట్ వయోలెట్ కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ ఏ05ఎస్(Samsung Galaxy A05s) ఫోన్ శాంసంగ్ ఎక్స్‌క్లూజివ్, రిటైల్ స్టోర్లు, శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్, ఇతర ఈ-కామర్స్ వెబ్‌సైట్ల ద్వారా కొనుగోలు చేయొచ్చు. ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసే వారికి రూ.1000 క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తున్నది. శాంసంగ్ ఫైనాన్స్ +, ఎన్బీఎఫ్‌సీలు, ఇతర బ్యాంకుల్లో ఈఎంఐ ఆప్షన్లు పొడిగించేందుకు అనుమతించారు. నెలవారీ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. నెలవారీ ఈఎంఐ రూ.1,150 నుంచి ప్రారంభం అవుతుంది.
శాంసంగ్ గెలాక్సీ ఏ05ఎస్ ఫోన్ 6.7-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ (1,080 x 2,4000 పిక్సెల్స్) పీఎల్ఎస్ ఎల్సీడీ డిస్‌ప్లే కలిగి ఉంటది. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ వన్ యూఐ.5.1 ఔటాఫ్ బాక్స్ వర్షన్‌పై పని చేస్తుంది. ఓక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 680 ఎస్వోసీ చిప్‌సెట్‌తోపాటు 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‌గా వచ్చింది.
శాంసంగ్ గెలాక్సీ ఏ05ఎస్ ఫోన్ 50-మెగా పిక్సెల్ సెన్సర్ విత్ వైడ్ యాంగిల్ లెన్స్, 2-మెగా పిక్సెల్ సెన్సర్ విత్ మాక్రో లెన్స్, 2-మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్ కెమెరా ఉంటాయి. ఇక సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 13-మెగా పిక్సెల్స్ కెమెరా ఉంటుంది. డిస్‌ప్లేలో సెంటర్ అలైన్డ్ వాటర్ డ్రాప్ నాచ్ ఉంటుంది. 25 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో శాంసంగ్ గెలాక్సీ ఏ05ఎస్ ఫోన్ 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది. 4జీ ఎల్‌టీఈ, డ్యుయల్ బాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, యూఎస్బీ టైప్ సీ కనెక్టివిటీ కలిగి ఉంటది. 3.5 ఎంఎం ఆడియో జాక్‌తో వస్తుందీ ఫోన్.