Telugu Global
Science and Technology

OnePlus Open | ఇక `శాంసంగ్‌`తో సై అంటే సై.. 19న వ‌న్‌ప్ల‌స్ తొలి ఫోల్డ‌బుల్ స్మార్ట్ ఫోన్ లాంచింగ్‌.. ఇవీ డిటైల్స్‌?!

OnePlus Open | ప్ర‌ముఖ చైనా స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ వ‌న్ ప్ల‌స్ (OnePlus) భారత్ మార్కెట్లో త‌న తొలి ఫోల్డ‌బుల్ స్మార్ట్ ఫోన్ వ‌న్‌ప్ల‌స్ ఓపెన్ (OnePlus Open) ఆవిష్క‌ర‌ణ‌కు ముహూర్తం ఖ‌రారు చేసింది.

OnePlus Open | ఇక `శాంసంగ్‌`తో సై అంటే సై.. 19న వ‌న్‌ప్ల‌స్ తొలి ఫోల్డ‌బుల్ స్మార్ట్ ఫోన్ లాంచింగ్‌.. ఇవీ డిటైల్స్‌?!
X

OnePlus Open | ఇక `శాంసంగ్‌`తో సై అంటే సై.. 19న వ‌న్‌ప్ల‌స్ తొలి ఫోల్డ‌బుల్ స్మార్ట్ ఫోన్ లాంచింగ్‌.. ఇవీ డిటైల్స్‌?!

OnePlus Open | ప్ర‌ముఖ చైనా స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ వ‌న్ ప్ల‌స్ (OnePlus) భారత్ మార్కెట్లో త‌న తొలి ఫోల్డ‌బుల్ స్మార్ట్ ఫోన్ వ‌న్‌ప్ల‌స్ ఓపెన్ (OnePlus Open) ఆవిష్క‌ర‌ణ‌కు ముహూర్తం ఖ‌రారు చేసింది. ఈ నెల 19న భార‌త్ మార్కెట్‌లోకి వ‌న్‌ప్ల‌స్ ఓపెన్ (OnePlus Open) ఆవిష్క‌రిస్తారు. ప్ర‌స్తుతం ఫోల్డ‌బుల్ స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌పై శాంసంగ్ (Samsung) దే పెత్త‌నం. యూజ‌ర్ల‌కు ఉత్త‌మ అనుభవం ల‌భించేలా ఫోల్డ‌బుల్ స్మార్ట్‌ఫోన్ తేవ‌డం ద్వారా శాంసంగ్ (Samsung) కు స‌వాల్ విస‌రాల‌ని వ‌న్‌ప్ల‌స్ (OnePlus) త‌హ‌త‌హలాడుతోంది. శాంసంగ్ గెలాక్సీ జ‌డ్ ఫోల్డ్ 5 (Samsung Galaxy Z Fold 5) ఫోన్‌కు వ‌న్‌ప్ల‌స్ ఓపెన్ గ‌ట్టి పోటీ ఇవ్వ‌నున్న‌ది..

వ‌న్‌ప్ల‌స్ ఓపెన్ (OnePlus Open) ఫోన్ ఫాస్ట్‌గా, హాయిగా, స్మూత్‌గా ప‌ని చేస్తుంద‌ని వ‌న్‌ప్ల‌స్ (OnePlus) చెబుతోంది. త‌న ఫోల్డ‌బుల్ స్మార్ట్ ఫోన్ స్లిమ్ డిజైన్‌తో లెట్‌వెయిట్ క‌లిగి ఉంటుంద‌ని పేర్కొంది. స్క్రీన్ క్రీజ్‌పై ఎటువంటి ముడ‌తలు రావ‌ని, కెమెరా బాగా ప‌ని చేస్తుంద‌ని వ‌న్‌ప్ల‌స్ తెలిపింది. ప్ర‌స్తుత ద‌శ ఫోల్డ‌బుల్ స్మార్ట్‌ఫోన్ల‌ను త‌దుప‌రి ద‌శ‌కు తీసుకెళ్లేందుకు ఆల్‌రౌండ్ ఫ్లాగ్‌షిప్ లెవెల్ ఎక్స్‌పీరియ‌నెన్స్‌తో వ‌న్‌ప్ల‌ప్ ఓపెన్‌ ఫోల్డ‌బుల్ స్మార్ట్‌ఫోన్ల కాన్సెప్ట్‌ను పున‌ర్నిర్వ‌చిస్తుంది అని వ‌న్‌ప్ల‌స్ వాదిస్తోంది.

వివిధ వార్తా సంస్థ‌ల్లో వ‌చ్చిన వార్త‌ల ప్ర‌కారం వ‌న్‌ప్ల‌స్ ఓపెన్ (OnePlus Open) ధ‌ర భార‌త్ మార్కెట్‌లో సుమారు రూ.1,41,490 (1699 డాల‌ర్లు) ప‌లుకుతుంది. అమెరికాలోనూ ఇదే ధ‌ర ప‌లుకుతుంద‌ని చెబుతున్నారు. త‌మ తొలి ఫోల్డ‌బుల్‌ స్మార్ట్‌ఫోన్ వ‌న్‌ప్ల‌స్ ఓపెన్‌ ధ‌ర చూసిన త‌ర్వాత యూజ‌ర్లు శాంసంగ్ కంటే త‌మ వైపే మొగ్గు చూపుతార‌ని వ‌న్‌ప్ల‌స్ భావిస్తోంది.

వ‌న్‌ప్ల‌స్ ఓపెన్ (OnePlus Open) ఫోల్డ‌బుల్ స్మార్ట్‌ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ మ‌ద్ద‌తుతో 7.8 అంగుళాల స్క్రీన్‌తో ఓపెన్ అవుతుంది. ఇదే రీఫ్రెష్ రేట్‌తో క‌వ‌ర్ డిస్‌ప్లే 6.3 అంగుళాలు ఉండొచ్చున‌ని భావిస్తున్నారు. క్వాల్‌కామ్ ఫ్లాగ్‌షిప్ స్నాప్ డ్రాగ‌న్ 8 జెన్ 2 చిప్‌సెట్‌, 8 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ కెపాసిటీతో వ‌స్తుంద‌ని చెబుతున్నారు. ఈ ఫోన్‌లో అల‌ర్ట్ స్లైడ‌ర్ ఫీచ‌ర్ కూడా ఉంటుంద‌ని స‌మాచారం. గ్యాప్‌లెస్ హింగ్ డిజైన్‌తో వ‌స్తున్న ఈ ఫోన్‌ను వ‌న్‌ప్ల‌స్‌, ఒప్పో సంయుక్తంగా అభివృద్ధి చేసిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

వ‌న్‌ప్ల‌స్ ఓపెన్ (OnePlus Open) ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఔటాఫ్ బాక్స్ బేస్డ్ లేటెస్ట్ ఆక్సిజ‌న్ ఓఎస్‌తో ప‌నిచేస్తుంద‌ని స‌మాచారం. ట్రిపుల్ రేర్ కెమెరా సెట‌ప్ - 48 మెగా పిక్సెల్ + 48 మెగా పిక్సెల్ + 64 మెగా పిక్సెల్ సెన్స‌ర్ కెమెరాలు ఉంటాయ‌ని భావిస్తున్నారు. దీంతోపాటు సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ కెమెరా సెన్స‌ర్ వివ‌రాలు బ‌య‌టకు రాలేదు. 100 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మ‌ద్ద‌తుతో 4800 ఎంహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీతో వ‌న్‌ప్ల‌స్ ఓపెన్ ల‌భిస్తుంద‌ని తెలుస్తున్న‌ది.

First Published:  14 Oct 2023 11:43 AM IST
Next Story