OnePlus Nord CE 4 Lite 5G | 18న వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ 5జీ ఫోన్ ఆవిష్కరణ.. ధర రూ.20 వేల లోపే..?!
OnePlus Nord CE 4 Lite 5G | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్ (OnePlus) తన నార్డ్ (Nord) సిరీస్ కొత్త ఫోన్‌ను భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించేందుకు సిద్ధమైంది.

OnePlus Nord CE 4 Lite 5G | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్ (OnePlus) తన నార్డ్ (Nord) సిరీస్ కొత్త ఫోన్‌ను భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. ఈ నెల 18న వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ 5జీ (OnePlus Nord CE 4 Lite 5G) ఫోన్‌ను ఆవిష్కరించనున్నట్లు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ద్వారా వెల్లడించింది. గతేడాది మార్కెట్‌లోకి వచ్చిన వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ ఫోన్ కొనసాగింపుగా వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ 5జీ ఫోన్ తీసుకొస్తున్నారు.
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ 5జీ (OnePlus Nord CE4 Lite 5G) ఫోన్‌ను ఈ నెల 18 సాయంత్రం ఏడు గంటలకు ఆవిష్కరిస్తారు. ఆవిష్కరణ కార్యక్రమం వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్, అమెజాన్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ 5జీ ఫోన్ ధర రూ.20 వేల లోపు ఉంటుందని భావిస్తున్నారు.
వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 లైట్ 5జీ (OnePlus Nord CE4 Lite 5G) ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు మద్దతుతోపాటు 6.67-అంగుళాల ఫుల్ హెచ్‌డీ + అమోలెడ్ ప్యానెల్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ఎస్వోసీ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తోందీ ఫోన్. 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్ కెమెరా, 16 మెగా పిక్సెల్ మాక్రో లెన్స్ కెమెరా, ఉంటాయి. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16 మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఔటాఫ్ బాక్స్ వర్షన్‌పై పని చేస్తుంది. రెండేండ్ల పాటు ఆండ్రాయిడ్ ఓఎస్, మూడేండ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తుంది.
వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 లైట్ 5జీ ఫోన్ 80వాట్ల వైర్డ్ చార్జింగ్ మద్దతుతో 5500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది. వన్‌ప్లస్ నార్డ్ 4 లైట్ 5జీ ఫోన్ రూ.20 వేల లోపు ధరకే అందుబాటులోకి వస్తే రియల్‌మీ నార్జో 70 ప్రో, టెక్నో పొవా 6 ప్రో, పోకో ఎక్స్ 6 ఫోన్లకు గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు.