Telugu Global
Science and Technology

OnePlus Nord CE 4 Lite 5G | త్వ‌ర‌లో భార‌త్ మార్కెట్‌లోకి వ‌న్‌ప్ల‌స్ నుంచి బ‌డ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్‌.. ఇవీ డిటైల్స్‌..!

OnePlus Nord CE 4 Lite 5G | ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ వ‌న్‌ప్ల‌స్ నార్డ్ సీఈ 4 లైట్ 5జీ ఫోన్ త్వ‌ర‌లో భార‌త్ మార్కెట్‌లో ఆవిష్క‌రిస్తార‌ని తెలుస్తున్న‌ది.

OnePlus Nord CE 4 Lite 5G | త్వ‌ర‌లో భార‌త్ మార్కెట్‌లోకి వ‌న్‌ప్ల‌స్ నుంచి బ‌డ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్‌.. ఇవీ డిటైల్స్‌..!
X

OnePlus Nord CE 4 Lite 5G | ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ వ‌న్‌ప్ల‌స్ నార్డ్ సీఈ 4 లైట్ 5జీ ఫోన్ త్వ‌ర‌లో భార‌త్ మార్కెట్‌లో ఆవిష్క‌రిస్తార‌ని తెలుస్తున్న‌ది. గ‌త ఏడాది ఏప్రిల్‌లో భార‌త్ మార్కెట్‌లో ఆవిష్క‌రించిన వ‌న్‌ప్ల‌స్ నార్డ్ సీఈ3 లైట్ 5జీ ఫోన్ కొన‌సాగింపుగా వ‌న్‌ప్ల‌స్ నార్డ్ సీఈ4 లైట్ 5జీ ఫోన్ వ‌స్తోంది. అయితే, ఇప్ప‌టివ‌ర‌కూ వ‌న్‌ప్ల‌స్ నార్డ్ సీఈ 4 లైట్ 5జీ ఫోన్ ఎప్పుడు ఆవిష్క‌రిస్తామ‌న్న సంగ‌తి వెల్ల‌డించ‌లేదు. బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్‌సైట్‌తోపాటు ప‌లు స‌ర్టిఫికేష‌న్ సైట్ల‌లో వ‌న్‌ప్ల‌స్ నార్డ్ 4 5జీ, వ‌న్‌ప్ల‌స్ నార్డ్ సీఈ 4 లైట్ 5జీ ఫోన్‌లు క‌నిపించాయి. వ‌న్‌ప్ల‌స్ నార్డ్ సీఈ 4 లైట్ 5జీ ఫోన్ ధ‌ర రూ.20 వేల లోపు ఉంటుంద‌ని భావిస్తున్నారు. అలాగే వ‌చ్చేనెల‌లో ఆవిష్క‌రించే వ‌న్‌ప్ల‌స్ నార్డ్ 4 5జీ ఫోన్ ధ‌ర రూ.31,999 ప‌లుకుతుంద‌ని తెలుస్తోంది.

వ‌న్‌ప్ల‌స్ నార్డ్ సీఈ4 లైట్ 5జీ (OnePlus Nord CE 4 Lite 5G) ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.67-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోలెడ్ స్క్రీన్‌తో వ‌స్తుంద‌ని తెలుస్తోంది. క్వాల్ కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 6 జెన్‌1 ఎస్వోసీ చిప్‌సెట్ క‌లిగి ఉంటుంది. 5500 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీ, ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్స‌ర్ ఉంటాయి. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఓఎస్ వ‌ర్ష‌న్‌పై ప‌ని చేస్తుందీ ఫోన్ ఈ ఫోన్‌లో రెండేండ్ల‌పాటు ఆండ్రాయిడ్, మూడేండ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తామ‌ని వ‌న్‌ప్ల‌స్ తెలిపింది.

వ‌న్‌ప్ల‌స్ నార్డ్ సీఈ4 లైట్ 5జ ఫోన్ డ్యుయ‌ల్ రేర్ కెమెరా సెట‌ప్‌తో వ‌స్తుంద‌ని భావిస్తున్నారు. 50-మెగా పిక్సెల్ సెన్స‌ర్ కెమెరా, 2-మెగా పిక్సెల్ డెప్త్ సెన్స‌ర్ కెమెరాతోపాటు సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్ సెన్స‌ర్ కెమెరా ఉంటాయి. 5జీ, బ్లూటూత్‌, వై-ఫై క‌నెక్టివిటీ గ‌ల ఈ ఫోన్ త్వ‌ర‌లో థాయిలాండ్‌, ఇత‌ర గ్లోబ‌ల్ మార్కెట్ల‌లో వ‌న్‌ప్ల‌స్ ఆవిష్క‌రించ‌నున్న‌ది.

First Published:  5 Jun 2024 6:59 AM GMT
Next Story