Telugu Global
Science and Technology

మిడ్‌రేంజ్ బడ్జెట్‌లో వన్‌ప్లస్ నార్డ్ 4 రిలీజ్! ఫీచర్లివే..

ప్రముఖ మొబైల్‌ బ్రాండ్ వన్‌ప్లస్‌ నుంచి.. నార్డ్‌ సిరీస్‌లో భాగంగా ‘వన్‌ప్లస్ నార్డ్‌ 4 (OnePlus Nord 4)’ మొబైల్ లాంఛ్ అయింది. నార్డ్‌ 3కి కొనసాగింపుగా వస్తున్న ఈ ఫోన్‌లో ఏయే ఫీచర్లు అప్‌డేట్ అయ్యాయంటే..

మిడ్‌రేంజ్ బడ్జెట్‌లో వన్‌ప్లస్ నార్డ్ 4 రిలీజ్! ఫీచర్లివే..
X

ప్రముఖ మొబైల్‌ బ్రాండ్ వన్‌ప్లస్‌ నుంచి.. నార్డ్‌ సిరీస్‌లో భాగంగా ‘వన్‌ప్లస్ నార్డ్‌ 4 (OnePlus Nord 4)’ మొబైల్ లాంఛ్ అయింది. నార్డ్‌ 3కి కొనసాగింపుగా వస్తున్న ఈ ఫోన్‌లో ఏయే ఫీచర్లు అప్‌డేట్ అయ్యాయంటే..

రీసెంట్‌గా జరిగిన వన్‌ప్లస్ సమ్మర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో వన్‌ప్లస్.. నార్డ్ 4 మొబైల్‌ను లాంఛ్ చేసింది. మిడ్‌రేంజ్ బడ్జెట్‌లో తీసుకొచ్చిన ఈ మొబైల్‌లో మంచి కెమెరా, ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్లున్నాయి.

వన్‌ప్లస్‌ నార్డ్‌ 4 మొబైల్.. స్నాప్‌డ్రాగన్‌ 7+ జెన్ 3 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఆండ్రాయిడ్‌ 14 బేస్డ్ ఆక్సిజన్‌ ఓఎస్‌ 14.1పై రన్ అవుతుంది. ఇందులో 6.74 అంగుళాల 1.5కె అమోలెడ్‌ డిస్‌ప్లే ఉంటుంది. ఇది 120హెర్ట్జ్ రిఫ్రెష్‌ రేటుని సపోర్ట్ చేస్తుంది.

వన్‌ప్లస్‌ నార్డ్‌ 4 కెమెరాల విషయానికొస్తే.. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 8 ఎంపీ అల్ట్రా వైడ్‌ సెన్సర్, ముందువైపు 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటాయి. ప్రైమరీ కెమెరా ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ ఫీచర్‌‌తో వస్తుంది. ప్రైమరీ కెమెరాతో పాటు సెల్ఫీ కెమెరాతో కూడా 4కె వీడియో రికార్డ్ చేయొచ్చు. అలాగే ఇందులో100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే 5,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది. కేవలం 28 నిమిషాల్లో బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అవుతుందని కంపెనీ చెప్తోంది.

డిజైన్ పరంగా వన్‌ప్లస్‌ నార్డ్‌ 4 ప్రీమియంగా కనిపిస్తుంది. మెటల్ బ్యాక్ ప్యానల్‌తో వస్తుంది. ఐపీ 65 రేటింగ్, డ్యుయల్ నానో సిమ్ సపోర్ట్, బ్లూటూత్ 5.4, వైఫై 6, ఎన్‌ఎఫ్‌సీ, స్టీరియో స్పీకర్స్, యూఎఫ్‌ఎస్ 3.1 స్టోరేజ్ వంటి ఫీచర్లున్నాయి. నాలుగేళ్ల పాటు సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్స్, రెండేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ వస్తాయి.

వన్‌ప్లస్ నార్డ్ 4 బేస్‌ వేరియంట్ (8జీబీ+128జీబీ) ధర రూ.29,999, 8జీబీ+256 జీబీ వేరియంట్‌ ధర రూ.32,999, 12జీబీ+256 జీబీ వేరియంట్‌ రూ.35,999గా ఉన్నాయి. సిల్వర్‌, గ్రీన్‌, బ్లాక్ కలర్స్‌లో లభిస్తుంది. జులై 20 నుంచి సేల్‌కు అందుబాటులో ఉంటుంది.

First Published:  17 July 2024 9:13 AM GMT
Next Story