OnePlus Community Sale | వన్‌ప్లస్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లపై డిస్కౌంట్లు.. ఇవీ డీల్స్..!
OnePlus Community Sale | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ ప్లస్ (OnePlus) తన ఫ్లాగ్‌షిప్ ఫోన్లు, టాబ్లెట్లు, పాడ్స్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై డిస్కౌంట్ సేల్ ఆఫర్ చేసింది.

OnePlus Community Sale | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ ప్లస్ (OnePlus) తన ఫ్లాగ్‌షిప్ ఫోన్లు, టాబ్లెట్లు, పాడ్స్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై డిస్కౌంట్ సేల్ ఆఫర్ చేసింది. వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్ పేరుతో గురువారం నుంచి ఈ నెల 11 వరకూ డిస్కౌంట్ ధరలపై వన్ ప్లస్ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. వన్‌ప్లస్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ పోన్లు.. వన్‌ప్లస్ 12, వన్‌ప్లస్ 12ఆర్, వన్‌ప్లస్ నార్డ్ సీఈ4లతోపాటు సంస్థ తొలి ఫోల్డబుల్ ఫోన్ వన్‌ప్లస్ ఓపెన్.. ఇంకా వన్‌ప్లస్ పాడ్, వాచ్2, బడ్స్ ప్రో2లపైనా ధరల తగ్గింపు లభిస్తుంది. కస్టమర్లు వన్‌ప్లస్ ఆన్‌లైన్ స్టోర్, అమెజాన్, దేశంలోని అన్ని రిటైల్ షోరూమ్‌ల్లో డిస్కౌంట్ ధరలు అందుబాటులో ఉన్నాయని వన్‌ప్లస్ ప్రకటించింది. స్మార్ట్ ఫోన్లతోపాటు వైర్‌లెస్ హెడ్‌సెట్లు, కంపెనీ స్మార్ట్ వాచ్, టాబ్లెట్లపై బ్యాంకు డిస్కౌంట్లతోపాటు అదనపు రాయితీలు ఉన్నాయి.
కొత్తగా మార్కెట్‌లో ఆవిష్కరించిన వన్‌ప్లస్ 12 గ్లాసియల్ వైట్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్ లాంచింగ్ ధర రూ.64,999 పలుకుతున్నది. దానిపై రూ.3000 డిస్కౌంట్, రూ.2,000 కూపన్ డిస్కౌంట్ ఆఫర్ చేసింది. నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా లబిస్తాయి. అలాగే వన్‌ప్లస్ 12 ఆర్ ఫోన్ ధర రూ.39,999 పలుకుతుండగా, బ్యాంకు డిస్కౌంట్ రూపంలో రూ.2000, కూపన్ రూపంలో రూ.2000 రాయితీ అందుకోవచ్చు. వన్‌ప్లస్ 12 ఆర్ ఫోన్‌లో సెలెక్టివ్ వేరియంట్ల మీద ఈ ఆఫర్ వర్తిస్తుంది. వన్ ప్లస్ 12 ఆర్ ఫోన్ మీద రూ.6,000 ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తుంది. ఈ రెండు డిస్కౌంట్లతోపాటు జియో పోస్ట్ పెయిడ్ కస్టమర్లు 2,250 వరకూ బెనిఫిట్ పొందవచ్చు.
వన్‌ప్లస్ ఓపెన్ ఫోన్ మీద రూ.5000 వరకూ బ్యాంకు డిస్కౌంట్, 12 నెలల వరకూ నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ అందుబాటులో ఉంది. దీంతోపాటు వన్‌ప్లస్ వాచ్ 2 ను కాంప్లిమెంటరీ గిఫ్ట్‌గా అందుకోవచ్చు. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 ఫోన్ కొనుగోలు దారులకు రూ.2000 డిస్కౌంట్‌తోపాటు సెలెక్టెడ్ బ్యాంకు కార్డులపై నో-కాస్ట్ ఈఎంఐ లభిస్తుంది. ఇక వన్‌ప్లస్ పాడ్, వన్‌ప్లస్ పాడ్ గో కొనుగోలు చేస్తే రూ.3,000 వరకూ డిస్కౌంట్ కూపన్లు పొందొచ్చు. మరికొన్ని సెలెక్టెడ్ ఉత్పత్తులపై కూపన్ డిస్కౌంట్లు, బ్యాంకు ఆఫర్లు లభిస్తాయి. వన్‌ప్లస్ అఫిషియల్ కమ్యూనిటీ సేల్ పేజీలోకి వెళ్లి డిస్కౌంట్లు చెక్ చేసుకుని కస్టమర్లు తమకు ఇష్టమైన స్మార్ట్ ఫోన్లు కొనుక్కోవచ్చునని తెలిపింది.