OnePlus Ace 2 Pro | 24జీబీ రామ్ విత్ ఒకటిగా బైట్ స్టోరేజీ కెపాసిటీ.. వన్‌ప్లస్ ఏస్2 ప్రో స్పెషాలిటీ.. ఇవీ డిటైల్స్!
OnePlus Ace 2 Pro | గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్ పోన్ ఉంటుంది. ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్లతో ప్రీమియం ఫోన్లకు గిరాకీ పెరుగుతున్నది. రోజురోజుకు టెక్నాలజీ అభివృద్ధి చెందుతుండటంతో పలు ఫీచర్లు గల స్మార్ట్ ఫోన్లు వస్తున్నాయి.
OnePlus Ace 2 Pro | గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్ పోన్ ఉంటుంది. ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్లతో ప్రీమియం ఫోన్లకు గిరాకీ పెరుగుతున్నది. రోజురోజుకు టెక్నాలజీ అభివృద్ధి చెందుతుండటంతో పలు ఫీచర్లు గల స్మార్ట్ ఫోన్లు వస్తున్నాయి. తాజాగా చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ ప్లస్ (OnePlus) 24 జీబీ రామ్ విత్ ఒక టిగా బైట్ ఇంటర్నల్ స్టోరేజీతో వన్‌ప్లస్ ఏస్2 ప్రో (OnePlus Ace 2 Pro) తీసుకొచ్చింది. ఒక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ఎస్వోసీ చిప్‌సెట్‌తో వస్తున్న ఈ ఫోన్ బయోనిక్ వైబ్రేషన్ సెన్సర్ మోటార్, అథంటికేషన్ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ కలిగి ఉంటుంది. 24 జీబీ రామ్ విత్ ఒక టిగాబైట్ ఇంటర్నల్ స్టోరేజీ గల స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లోకి రావడం ఇదే మొదలు అని పేర్కొన్నా.. గత నెలలోనే మార్కెట్‌లోకి వచ్చిన రెడ్‌మాజిక్ 8ఎస్ ప్రో+ ఫోన్.. 24 జీబీ రామ్ విత్ ఒక టిగాబైట్ ఇంటర్నల్ స్టోరేజీ కలిగి ఉండటం ఆసక్తికర పరిణామం.
మల్టీ టాస్కింగ్ పరిష్కారానికి ఎస్‌కే హైనిక్స్ ప్రొడ్యూస్ చేసిన రామ్ 54 యాక్టివ్ యాప్స్‌కు సపోర్ట్‌గా, 41 యాప్స్ నిర్వహణకు అనుకూలంగా ఉంటుంది. గేమింగ్ ఆసక్తి కల వారికి వన్‌ప్లస్ ఏస్2 ప్రో (OnePlus Ace 2) ఫోన్ గేమింగ్ ఫోకస్డ్ ఫీచర్లతో వస్తున్నది. అల్ట్రా థిన్ ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్‌తో ఫోన్‌లో డేటా సెక్యూరిటీ బలోపేతం అవుతుంది.
వన్‌ప్లస్ ఏస్2 ప్రో (OnePlus Ace 2) ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ఎస్వోసీ చిప్‌సెట్‌తో వస్తున్నది. 6.74 అంగుళాల 1.5కే ఓలెడ్ డిస్‌ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. హెచ్‌డీఆర్10+ సర్టిఫికేషన్, 450పీపీఐ పిక్సెల్ డెన్సిటీ కలిగి ఉంటుంది. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 150 వాట్ల సూపర్ వూక్ చార్జింగ్ సపోర్ట్‌తో వస్తున్నది. గతేడాది మార్కెట్లో ఆవిష్కరించిన వన్ ప్లస్ ఏస్ ప్రో కొనసాగింపుగా వన్‌ప్లస్ ఏస్2ప్రో (OnePlus Ace 2) వస్తున్నది. ఈ నెల 16న చైనా మార్కెట్లో ఈ ఫోన్ ఆవిష్కరిస్తున్నది వన్‌ప్లస్. భారత్ సహా గ్లోబల్ మార్కెట్లలో ఎప్పుడు ఆవిష్కరిస్తారన్న సంగతి వెల్లడించలేదు.
వన్‌ప్లస్ ఏస్2 ప్రో (OnePlus Ace 2) ఫోన్ రేర్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తున్నది. 50 మెగా పిక్సెల్ విత్ ఎఫ్/1.8 అపెర్చర్ ప్రైమరీ కెమెరా, 8-మెగా పిక్సెల్ విత్ ఎఫ్/2.2 అపెర్చర్ కెమెరా, 2-మెగా పిక్సెల్ విత్ ఎఫ్/2.4 అపెర్చర్ కెమెరాతోపాటు.. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమెరా కలిగి ఉంటుంది.
వన్ ప్లస్ ఏస్2 ప్రో (OnePlus Ace 2) ఫొన్ కలర్స్ ఓఎస్ 12.1 బేస్డ్ ఆండ్రాయిడ్ 13 వర్షన్‌తో పని చేస్తుంది. సియాన్ కలర్‌తో ఆవిష్కరిస్తారు. వై-ఫై 802.11 ఏ/బీ/జీ/ఎన్ఏ/సీ/ఏఎక్స్, జీపీఎస్, బ్లూటూత్ వీ5.20 ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ, 3జీ, 4జీ, 5జీ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. కంపాస్, మాగ్నెటో మీటర్, గైరోస్కోప్, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, ప్రాగ్జిమిటీ సెన్సర్, సపోర్ట్స్ ఫేస్ అన్ లాక్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
OnePlus Ace 2 Pro | ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్ తొలిసారి 24 జీబీ రామ్ విత్ ఒక టిగా బైట్ ఇంటర్నల్ స్టోరేజీతో కూడిన వన్‌ప్లస్ ఏస్2 ప్రో ఫోన్ మార్కెట్లోకి తెస్తున్నది. ఈ నెల 16న చైనా మార్కెట్లో ఆవిష్కరిస్తున్నారు.