Telugu Global
Science and Technology

ఇకపై నో ట్రాకింగ్‌! వాట్సాప్‌లో కొత్త ప్రైవసీ అప్‌డేట్!

దేశంలో సైబర్ మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో మెటా సంస్థ వాట్సాప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్లను యాడ్ చేసింది.

ఇకపై నో ట్రాకింగ్‌! వాట్సాప్‌లో కొత్త ప్రైవసీ అప్‌డేట్!
X

ఇకపై నో ట్రాకింగ్‌! వాట్సాప్‌లో కొత్త ప్రైవసీ అప్‌డేట్!

దేశంలో సైబర్ మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో మెటా సంస్థ వాట్సాప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్లను యాడ్ చేసింది. ఇకపై వాట్సాప్ యూజర్ల ఐపీ అడ్రెస్‌ను మూడో వ్యక్తి ట్రాక్ చేయకుండా సెక్యూరిటీని పటిష్టం చేసింది. వివరాల్లోకి వెళ్తే..

వాట్సాప్‌లో ఫేక్ కాల్స్, మెసేజ్‌ల ద్వారా అమాయకులను మోసం చేస్తున్న సైబర్ మోసాగాళ్ల బారి నుంచి యూజర్లు రక్షించేందుకు వాట్సాప్ సేఫ్టీ ఫీచర్స్‌లో మార్పులు చేసింది. వాట్సాప్ బీటా ఇన్ఫో ప్రకారం.. వాట్సాప్ యాప్‌లో ‘ప్రొటెక్ట్ ఐపీ అడ్రస్ ఇన్ కాల్స్’ అనే కొత్త ఫీచర్‌ అందుబాటులోకి తీసుకురాబోతుంది.

ఈ ఫీచర్‌‌ సాయంతో వాట్సాప్ కాల్స్ చేసినప్పుడు యూజర్ల ఐపీ అడ్రస్, ఇతర వ్యక్తిగత వివరాలను థర్డ్ పార్టీ వ్యక్తులు తెలుసుకోలేరు. వాట్సాప్ కాల్స్ మాట్లాడుకునేటప్పుడు సైబర్ నేరగాళ్లు వాటిని ట్రాక్ చేసి యూజర్ల లోకేషన్‌ను తెలుసుకుంటారు. ఈ సెక్యూరీటీ అప్‌డేట్‌తో ఇకపై అది కుదరదు. ఈ ఫీచర్ యూజర్లకు ప్రైవసీ సేఫ్టీని అందిస్తుంది. అయితే ఈ ఫీచర్ వల్ల వాట్సాప్ కాల్ క్వాలిటీ తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ అప్‌డేట్ త్వరలోనే అందుబాటులోకి రానుంది.

ఇకపోతే రీసెంట్‌గా వాట్సాప్ ‘సైలెన్స్ అన్‌నోన్ కాలర్స్’ అనే ప్రైవసీ ఫీచర్‌ను తీసుకొచ్చింది. యూజర్లకు వాట్సాప్ ఇన్‌కమింగ్ కాల్స్‌పై మరింత కంట్రోల్ ఉండేందుకు ఈ ఫీచర్ తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌‌తో స్పామ్ కాల్స్, ఫేక్ కాల్స్‌కు చెక్ పెట్టొచ్చు. తెలియని వ్యక్తుల నుంచి కాల్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా మ్యూట్ చేయొచ్చు.

First Published:  1 Sept 2023 11:00 AM IST
Next Story