Telugu Global
Science and Technology

వాట్సాప్ గ్రూప్స్‌లో కొత్త ఫీచర్లు!

మెసేజింగ్ యాప్ వాట్సాప్ తాజాగా కొన్ని లేటెస్ట్ అప్‌డేట్స్‌ను యాడ్ చేసింది. ముఖ్యంగా వాట్సాప్ గ్రూప్స్‌లో వచ్చే సమస్యలను పరిష్కరిస్తూ కొన్ని కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది.

వాట్సాప్ గ్రూప్స్‌లో కొత్త ఫీచర్లు!
X

వాట్సాప్ గ్రూప్స్‌లో కొత్త ఫీచర్లు!

మెసేజింగ్ యాప్ వాట్సాప్ తాజాగా కొన్ని లేటెస్ట్ అప్‌డేట్స్‌ను యాడ్ చేసింది. ముఖ్యంగా వాట్సాప్ గ్రూప్స్‌లో వచ్చే సమస్యలను పరిష్కరిస్తూ కొన్ని కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. అవేంటంటే..

ఇతరుల అనుమతి తీసుకోకుండానే వాట్సాప్ గ్రూపుల్లో యాడ్ చేస్తుంటారు చాలామంది. ఇది చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది. గ్రూపులో కంటిన్యూ అవ్వలేక అలాగని ఎగ్జిట్ అవ్వలేక ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి సమస్యలకు చెక్ పెడుతూ కొత్త ప్రైవసీ సెట్టింగ్‌కు తీసుకొచ్చింది వాట్సాప్. ఇకపై వ్యక్తి అనుమతి లేకుండా వాట్సాప్ గ్రూప్‌లో చేర్చడం వీలు కాదు.

గ్రూప్ ప్రైవసీ ఇలా..

వాట్సాప్ లో ‘సెట్టింగ్స్’లోకి వెళ్లి ‘ప్రైవసీ’ పై క్లిక్ చేస్తే.. అక్కడ ‘గ్రూప్స్’ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే.. ‘ఎవ్రీవన్’, ‘మై కాంటాక్ట్స్’, ‘మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్’ అనే ఆప్షన్లు కనిపిస్తాయి. ఎవరైనా గ్రూప్‌లో యాడ్ చేయొచ్చు అనుకుంటే ‘ఎవ్రీ వన్’ సెలక్ట్ చేసుకోవాలి. అలా కాకుండా యాడ్ చేసేముందు ఇన్వైట్ పర్మిషన్ రావాలి అనుకుంటే మిగతా ఆప్షన్లు ఎంచుకోవాలి.

గ్రూప్ వాయిస్ చాట్స్

ఇకపోతే గ్రూప్‌ కాల్స్‌కు ప్రత్యామ్నాయంగా ‘వాయిస్‌ చాట్స్‌’ అనే కొత్త ఫీచర్‌‌ను తీసుకురానుంది వాట్సాప్. సాధారణ గ్రూప్‌ కాల్స్‌తో పోలిస్తే ఈ ఫీచర్‌ కాస్త భిన్నంగా ఉంటుంది. గ్రూప్ కాల్స్‌లో ఉండే ఇబ్బందులకు చెక్‌ పెడుతూ ఈ వాయిస్‌ చాట్స్‌ ఫీచర్‌ని తీసుకొచ్చింది.

వాయిస్ చాట్‌లో పాల్గొనే యూజర్లకు ఎలాంటి రింగ్ రాదు. సైలెంట్ నోటిఫికేషన్ మాత్రమే వస్తుంది. వాయిస్‌ ఛాట్‌లో పాల్గొనాలనుకొనే వాళ్లు కాల్‌ ముగిసేలోగా ఎప్పుడైనా జాయిన్‌ అవ్వొచ్చు. గ్రూప్ వాయిస్ చాట్స్‌లో గంట సేపు మాత్రమే మాట్లాడుకునే వీలుంది. ఆ తర్వాత ఆటోమేటిక్‌గా కాల్‌ కట్‌ అవుతుంది. ఈ కాల్‌ పూర్తిగా ఎన్‌క్రిప్ట్ అయ్యి ఉంటుంది. అంటే చాట్‌లో జాయిన్‌ అయిన వ్యక్తులు తప్ప మరెవరూ వాయిస్ చాట్‌ను వినలేరు. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది. త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది.

First Published:  17 Nov 2023 7:00 AM IST
Next Story