Telugu Global
Science and Technology

వాట్సాప్‌లో రాబోతున్న కొత్త ఫీచర్లు

అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో ఎప్పటికప్పుడు యూజర్లను అట్రాక్ట్ చేస్తున్న వాట్సాప్.. త్వరలో మరిన్ని సరికొత్త ఫీచర్లు తీసుకు రాబోతుంది.

వాట్సాప్‌లో రాబోతున్న కొత్త ఫీచర్లు
X

అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో ఎప్పటికప్పుడు యూజర్లను అట్రాక్ట్ చేస్తున్న వాట్సాప్.. త్వరలో మరిన్ని సరికొత్త ఫీచర్లు తీసుకు రాబోతుంది. కెమెరా మోడ్‌, డీఎన్‌డీ మోడ్‌, కాల్‌ ఇన్విటేషన్‌ లాంటి లేటెస్ట్ ఫీచర్లు ఎలా పనిచేస్తాయో ఇప్పుడు చూద్దాం.

కాల్ ఇన్విటేషన్‌

వాట్సాప్‌లో వీడియో లేదా ఆడియోకాల్స్‌ కోసం లింక్‌ ఇన్విటేషన్‌ ఫీచర్‌ రాబోతుంది. ఈ ఫీచర్ తీసుకొస్తున్నట్లు మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ కొద్దిరోజుల క్రితం ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. ఈ ఫీచర్ సాయంతో గ్రూప్‌ కాల్ చేసేటప్పుడు కాల్‌ సెక్షన్‌లోని వెళ్లి లింక్‌ను క్రియేట్ చేయాలి. తర్వాత లింక్ షేర్‌ చేస్తే, అవతలివారు లింక్‌పై క్లిక్ చేసి, కాల్‌లో జాయిన్ అవుతారు.

కెమెరా మోడ్‌

ప్రస్తుతం వాట్సాప్‌ యాప్‌ ద్వారా ఫొటో తీయాలంటే చాట్ పేజీలో కెమెరా ఐకాన్‌పై క్లిక్ చేయాలి. అలాగే వీడియో రికార్డింగ్‌ కోసం కెమెరా ఓపెన్‌ అయిన తర్వాత క్యాప్చర్ బటన్‌ను కొన్ని సెకన్లపాటు హోల్డ్ చేయాలి. అయితే ఈ సరికొత్త ఫీచర్‌తో యూజర్లు ఫొటో,వీడియో మోడ్‌లోకి సులువుగా మారొచ్చు.

గ్రూప్ కాల్స్

వాట్సాప్‌ వీడియోకాల్‌లో ప్రస్తుతం ఎనిమిది మంది పాల్గొనొచ్చు. అయితే ఇప్పుడు రాబోతున్న అప్‌డేట్‌తో ఒకేసారి 32 మంది పాల్గొనే వీలుంటుంది.

డీఎన్‌డీ మోడ్‌

వాట్సా్ప్‌లో 'డూ నాట్ డిస్ట్రబ్‌' మోడ్‌ పేరుతో కొత్త ఫీచర్‌ రాబోతోంది. ఈ ఫీచర్‌ ఎనేబుల్ చేస్తే వాట్సాప్‌ కాల్స్‌, మెసేజెస్ వచ్చినప్పుడు సౌండ్, స్క్రీన్‌పై నోటిఫికేషన్స్ కనిపించవు. మీటింగ్‌లో ఉన్నప్పుడు, డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు డిస్టర్బెన్స్ లేకుండా ఉండేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.

వాయిస్‌ స్టేటస్‌

వాట్సాప్‌లో ఫొటోలు, వీడియోలు, టెక్ట్స్‌ను మాత్రమే స్టేటస్‌గా పెట్టుకునే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు రాబోతున్న ఫీచర్‌తో యూజర్లు ఆడియో క్లిప్స్‌, వాయిస్‌ నోట్స్‌ను కూడా వాట్సాప్‌ స్టేటస్‌గా పెట్టుకోవచ్చు. ఆడియో స్టేటస్‌ కోసం యూజర్లు స్టేటస్‌ బార్‌ ఓపెన్ చేసి, అక్కడ కనిపించే మైక్‌ సింబల్‌ పై క్లిక్‌ చేసి, ఆడియో రికార్డ్‌ చేయాలి. తర్వాత నచ్చిన కలర్‌ బ్యాక్‌గ్రౌండ్‌తో దాన్ని స్టేటస్‌లో అప్‌డేట్ చేయొచ్చు.

స్టిక్కర్స్‌

యూజర్లు తమకు నచ్చిన స్టిక్కర్‌ను వాట్సాప్ డీపీగా పెట్టుకుకనేలా మరో ఫీచర్ రాబోతుంది. ఈ ఫీచర్‌తో యూజర్‌ తనకు నచ్చిన అవతార్‌ లేదా స్టిక్కర్‌ను వాట్సాప్‌లో క్రియేట్ చేసుకుని ప్రొఫైల్‌ ఫొటోగా మార్చుకోవచ్చు.

డాక్యుమెంట్‌ క్యాప్షన్‌

వాట్సాప్‌ ద్వారా పంపే ఫైల్స్‌ను ఈజీగా సెర్చ్ చేసుకునేలా వాట్సాప్ ఓ ఫీచర్ తీసుకురాబోతుంది. చాట్‌లో పంపిన ఫైల్‌ను కావాల్సినప్పుడు ఈజీగా వెతికేలా ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. వాట్సాప్ లో డాక్యుమెంట్‌ పంపేటప్పుడు దానికి నచ్చిన క్యాప్షన్‌ ఇచ్చి పంపొచ్చు. దానివల్ల భవిష్యత్తులో డాక్యుమెంట్‌ కోసం సెర్చ్‌ పేజీలో క్యాప్షన్‌ను టైప్‌ చేసి సులువుగా వెతకొచ్చు.

First Published:  6 Oct 2022 2:29 PM IST
Next Story