వాట్సాప్‌లో మల్టీ అకౌంట్స్, స్క్రీన్ షేరింగ్ ఫీచర్లు!
యూజర్ల కోరిక మేరకు వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తూనే ఉంది. రీసెంట్‌గానే ఇన్‌స్టంట్ వీడియో కాలింగ్, చాట్ ట్రాన్స్‌ఫర్ వంటి ఫీచర్స్‌ని తీసుకొచ్చింది. ఇప్పుడు కొత్తగా ‘మల్టిపుల్ అకౌంట్స్’ ఫీచర్‌తో పాటు ‘స్క్రీన్ షేరింగ్’ ఆప్షన్స్‌ను యాడ్ చేసింది.
యూజర్ల కోరిక మేరకు వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తూనే ఉంది. రీసెంట్‌గానే ఇన్‌స్టంట్ వీడియో కాలింగ్, చాట్ ట్రాన్స్‌ఫర్ వంటి ఫీచర్స్‌ని తీసుకొచ్చింది. ఇప్పుడు కొత్తగా ‘మల్టిపుల్ అకౌంట్స్’ ఫీచర్‌తో పాటు ‘స్క్రీన్ షేరింగ్’ ఆప్షన్స్‌ను యాడ్ చేసింది. ఇవెలా పనిచేస్తాయంటే..
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి యాప్స్‌లో ఎప్పటినుంచో మల్టిపుల్ అకౌంట్స్ ఫీచర్ ఉంది. కానీ, వాట్సాప్‌లో మాత్రం కేవలం ఒకే అకౌంట్ కి వీలుంది. దాంతో యూజర్లు క్లోన్ యాప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడం ఇతర ఫోన్‌లో మరో వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేయడం వంటివి చేస్తున్నారు. అయితే ఇప్పుడొచ్చిన ఫీచర్‌తో ఒకే యాప్‌లో మల్టిపుల్ వాట్సాప్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు.
వాట్సాప్ మల్టిపుల్ అకౌంట్స్ ఫీచర్‌తో ఒకే యాప్‌లో ప్రైవేట్ చాట్‌లు, వర్క్ చాట్‌లను సెపరేట్‌గా యాక్సెస్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్లు కూడా వేర్వేరుగా వస్తాయని వాట్సాప్ చెప్తోంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్.. బీటా కస్టమర్లకు అందుబాటులో ఉంది. కొన్ని వారాల్లోనే ఇది అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇకపోతే వాట్సాప్‌లో లేటెస్ట్గా ‘స్క్రీన్ షేరింగ్’ అనే ఫీచర్ వచ్చింది. వాట్సాప్ చాట్స్ ను స్క్రీన్ షాట్స్ తీసి పంపే పని లేకుండా నేరుగా స్క్రీన్ ను షేర్ చేయొచ్చు. దీనికోసం వాట్సాప్ వీడియో కాల్ చేసి.. అవతలి వాళ్లు కాల్ లిఫ్ట్ చేశాక వీడియో కింద కుడివైపున ఉన్న షేరింగ్ సింబల్ క్లిక్ చేయాలి. అక్కడ ‘స్టార్ట్ నౌ’ పై ట్యాప్ చేస్తే.. మీ ఫోన్‌లో ఉన్న స్ర్కీన్ అవతలి వాళ్లకు షేర్ అవుతుంది. మీ ఫోన్‌లో ఏ యాప్ ఓపెన్ చేసినా.. అవతలివాళ్లకు అది కనిపిస్తుంది. ప్రజెంటేషన్స్, ఫైల్స్ వంటివి రెడీ చేసేటప్పుడు ఈ ఫీచర్ బాగా పనికొస్తుంది. ఫోన్‌లో చెప్తే అర్థం కాని సందర్భాలు ఇలా వీడియో కాల్ చేసి, స్ర్కీన్ షేరింగ్ ద్వారా అర్థమయ్యేలా చూపించొచ్చు.