Moto Razr 50 Ultra | భారత్‌లో మోటరోలా ప్రీమియం ఫోన్ మోటో రేజర్ 50 ఆల్ట్రా ఆవిష్కరణకు ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..?!
Moto Razr 50 Ultra | చైనా మార్కెట్‌లో ఆవిష్కరించిన మోటో రేజర్ 50 ఆల్ట్రా (Moto Razr 50 Ultra) ఫోన్‌ను భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించడానికి ముహూర్తం ఖరారు చేసింది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ద్వారా ఫ్లిప్‌స్టైల్ ఫోల్డబుల్ ఫోన్ మోటో రేజర్ 50 ఆల్ట్రా (Moto Razr 50 Ultra) విక్రయించనున్నది.
Moto Razr 50 Ultra | చైనా ఎలక్ట్రానిక్స్ మేజర్ లెనోవో (Lenovo) అనుబంధ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా (Motorola) తన ప్రీమియం ఫోన్లు మోటో రేజర్ 50 (Moto Razr 50), మోటో రేజర్ 50 ఆల్ట్రా (Moto Razr 50 Ultra) ఫోన్లను చైనాతోపాటు నార్త్ అమెరికా, యూరప్, బ్రిటన్‌తోపాటు సెలెక్టెడ్ గ్లోబల్ మార్కెట్లలో మంగళవారం ఆవిష్కరించింది. చైనా మార్కెట్‌లో ఆవిష్కరించిన మోటో రేజర్ 50 ఆల్ట్రా (Moto Razr 50 Ultra) ఫోన్‌ను భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించడానికి ముహూర్తం ఖరారు చేసింది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ద్వారా ఫ్లిప్‌స్టైల్ ఫోల్డబుల్ ఫోన్ మోటో రేజర్ 50 ఆల్ట్రా (Moto Razr 50 Ultra) విక్రయించనున్నది.
మోటో రేజర్ 50 ఆల్ట్రా (Moto Razr 50 Ultra) ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 (Qualcomm Snapdragon 8s Gen 3) ప్రాసెసర్‌తో పని చేస్తుంది. త్వరలో మార్కెట్‌లోకి రానున్న శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫ్లిప్ 6 (Samsung Galaxy Z Flip 6) ఫోన్‌తో పోటీ పడుతుంది. లెనోవో (Lenovo) అనుబంధ మోటరోలా తన మోటో రేజర్ 50 ఆల్ట్రా (Moto Razr 50 Ultra) ఫోన్‌ను జూలై నాలుగో తేదీన భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించనున్నది.
మోటో రేజర్ 50 ఆల్ట్రా (Moto Razr 50 Ultra) ఫోన్ మిడ్‌నైట్ బ్లూ (Midnight Blue), స్ప్రింగ్ గ్రీన్ (Spring Green), పీచ్ ఫజ్ (Peach Fuzz) కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. మోటో రేజర్ 50 ఆల్ట్రా ఫోన్‌లో మోటో ఏఐ (Moto AI), గూగుల్ జెమినీ (Google Gemini) ఫీచర్లు ఉంటాయి. 165 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ మద్దతు, గొరిల్లా గ్లాస్ విక్టస్ (Gorilla Glass Victus) ప్రొటెక్షన్‌తోపాటు 4-అంగుళాల (1,080x1,272 పిక్సెల్స్) పోలెడ్ కవర్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 8ఎస్ జెన్ 3 (Qualcomm Snapdragon 8s Gen 3) ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 45వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతు, 15వాట్ల వైర్‌లెస్ చార్జింగ్ మద్దతుతో 4000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది.
మోటో రేజర్ 50 ఆల్ట్రా (Moto Razr 50 Ultra) ఫోన్ 6.9- అంగుళాల ఇంటర్నల్ పోలెడ్ ఫ్లెక్సిబుల్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ డ్యుయల్ ఔటర్ కెమెరా సెటప్‌తో వస్తోంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) మద్దతుతో 50-మెగా పిక్సెల్ మెయిన్ సెన్సర్ కెమెరా, 50 - మెగా పిక్సెల్ టెలిఫోటో కెమెరా, ఇన్నర్ డిస్‌ప్లేలో 32-మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ ఐపీఎక్స్ 8 (IPX8) రేటెడ్ వాటర్ రెసిస్టెన్స్ బిల్డ్ చేశారు.
చైనాతోపాటు ఆవిష్కరించిన గ్లోబల్ మార్కెట్లలో మోటో రేజర్ 50 ఆల్ట్రా (Moto Razr 50 Ultra) ఫోన్ 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.66 వేలు (5699 చైనా యువాన్లు), టాప్ ఎండ్ మోడల్ 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ ఫోన్ దాదాపు రూ.74 వేలు (6199 చైనా యువాన్లు) పలుకుతుంది. భారత్ మార్కెట్‌లోనూ ఇవే ధరలకు అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. మోడ్రన్ గ్రీన్ (Modern Green), పీచ్ ఫజ్ (Peach Fuzz), వింటేజ్ డెనిమ్ (Vintage Denim) రంగుల్లో లభిస్తుంది. మోటో రేజర్ 50 ఆల్ట్రా ఫోన్ ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫ్లిప్ 5 (Samsung Galaxy Z Flip 5) ఫోన్‌తోపాటు త్వరలో మార్కెట్‌లోకి రానున్న శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫ్లిప్ 6 (Samsung Galaxy Z Flip 6) ఫోన్‌కూ గట్టి పోటీ ఇవ్వనున్నది.