వాట్సాప్‌లో సెర్చ్ బై డేట్ ఫీచర్
ఇప్పుడు తాజాగా చాట్‌లో డేట్ ప్రకారం మెసేజ్‌లను సెర్చ్ చేసుకునేలా ‘సెర్చ్ బై డేట్’ టూల్ తీసుకొచ్చింది.
వాట్సాప్ తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తూనే ఉంటుంది. ఇప్పుడు తాజాగా చాట్‌లో డేట్ ప్రకారం మెసేజ్‌లను సెర్చ్ చేసుకునేలా ‘సెర్చ్ బై డేట్’ టూల్ తీసుకొచ్చింది. ఇదెలా పనిచేస్తుందంటే..
వాట్సాప్ చాట్‌లో బోలెడు మెసేజ్‌లు ఉంటాయి. అయితే వాటిలో కావాల్సిన మెసేజ్‌లను ఈజీగా సెర్చ్ చేసేందుకు వీలుగా ‘సెర్చ్ బై డేట్’ అనే ఫీచర్ పనికొస్తుంది. ఈ ఫీచర్ సాయంతో పాత మెసేజ్‌లను తేదీల వారీగా తిరిగి పొందొచ్చు.
మామూలుగా వాట్సాప్‌లో పాత మెసేజ్‌ను చదవాలంటే అన్ని మెసేజ్‌లను వెతకాల్సిందే. అయితే ఈ కొత్త ఫీచర్‌తో ఆ వెతికే పని తప్పుతుంది. డేట్ ఎంటర్ చేయగానే ఆ రోజుకు సంబంధించిన మెసేజ్‌లు వెంటనే స్క్రీన్‌పై కనిపిస్తాయి. చాట్‌లో ‘సెర్చ్’ ఆప్షన్‌లో వెళ్లాక, క్యాలెండర్ కనిపిస్తుంది.
అక్కడ సంవత్సరం, నెల, డేట్ సెలెక్ట్ చేస్తే ఆ టైంలో పంపిన, వచ్చిన మెసేజ్‌లన్ని కనిపిస్తాయి. ఈ ఫీచర్ యాపిల్ యూజర్లకు నెక్స్ట్ అప్‌డేట్‌తో రానుంది. మిగతా యూజర్లకు త్వరలోనే అందుబాటులోకి వస్తుంది.