Telugu Global
Science and Technology

ఫోన్ తడిస్తే ఇలా చేయాలి!

వానాకాలంలో బయటకు వెళ్లినప్పుడు అనుకోకుండా మొబైల్ తడిచిపోవచ్చు. ఇలాంటప్పుడు ఫోన్ పాడవ్వకుండా ఉండాలంటే కొన్ని బేసిక్ ప్రికాషన్స్ తీసుకోవాలి.

ఫోన్ తడిస్తే ఇలా చేయాలి!
X

వానాకాలంలో బయటకు వెళ్లినప్పుడు అనుకోకుండా మొబైల్ తడిచిపోవచ్చు. ఇలాంటప్పుడు ఫోన్ పాడవ్వకుండా ఉండాలంటే కొన్ని బేసిక్ ప్రికాషన్స్ తీసుకోవాలి.

వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ లేని మొబైల్స్.. నీటిలో తడిస్తే వెంటనే డిస్‌ప్లే, బ్యాటరీ దెబ్బ తింటాయి. ఇలా తడిచి పాడయ్యిన మొబైల్స్‌ను రిపేర్ చేయడం కూడా కష్టమే. అందుకే మొబైల్‌ను వీలైనంతవరకూ తడవకుండా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఒకవేళ తడిస్తే వెంటనే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.

మొబైల్ నీటిలో పడినా లేదా వానకు తడిచినట్టు అనిపించినా.. వెంటనే దాన్ని స్విచాఫ్ చేసేయాలి. తడిచిన మొబైల్‌ను ఆన్‌ చేసి ఉంచితే మొబైల్‌లోని బోర్డ్ పాడయ్యే అవకాశం ఉంది.

తడిచిన మొబైల్‌ను స్విచాఫ్ చేశాక బ్యాక్ కవర్ తీసివేసి స్పీకర్, చార్జింగ్ పోర్ట్ దగ్గర నోటితో నీటిని పీల్చే ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత పొడి గుడ్డతో ఫోన్‌ను శుభ్రంగా తుడిచి సిమ్ కార్డ్, ఎస్‌డీ కార్డ్ వంటి వాటని రిమూవ్ చేయాలి. ఆ తర్వాత మొబైల్‌ను బియ్యం డబ్బాలో పెట్టి పూర్తిగా కవర్ చేయాలి. బియ్యానికి నీటిని పీల్చేసే గుణం ఉంటుంది. కాబట్టి ఐదారు గంటల పాటు మొబైల్‌ను బియ్యంలో పెట్టి వదిలేయాలి. ఆరు గంటల తర్వాత మొబైల్ తీసి ఆన్ చేసి చూడాలి. ఆన్ అయితే ఓకే. లేకపోతే సర్వీస్ సెంటర్‌‌కు తీసుకెళ్లాల్సిందే.

ఇకపోతే వర్షానికి మొబైల్ తడవకుండా వాటర్ ప్రూఫ్ కవర్లు దొరుకుతున్నాయి. అవి కొనుక్కుంటే మంచిది. వర్షంలో బయటకు వెళ్లేటప్పుడు వెంట ఆ కవర్ తీసుకెళ్తే ఉపయోగకరంగా ఉంటుంది. ఈ మధ్య వస్తున్న మొబైల్స్ లో ఐపీ 52, ఐపీ62 రేటింగ్ అని కనపిస్తుంది. వీటిలో వాటర్ రెసిస్టెన్స్ అని ఉంటే మొబైల్స్ పూర్తిగా నీటిలో మునిగినా పాడవ్వకుండా ఉండగలవు అని అర్థం. ఒకవేళ స్ప్లాష్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ అని ఉంటే అవి కేవలం కొద్దిపాటి తడిని మాత్రమే తట్టుకోగలవు అని అర్థం.

First Published:  20 July 2024 12:30 AM GMT
Next Story