Telugu Global
Science and Technology

ఈ ఏడాది వాట్సాప్‌లో వచ్చిన బెస్ట్ ఫీచర్లివే!

మెసేజింగ్ యాప్ వాట్సాప్.. ఈ ఏడాది ఎన్నో కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. వీటిలో ప్రైవసీ, మీడియా, యూజబిలిటీ.. ఇలా పలురకాల ఫీచర్లున్నాయి.

ఈ ఏడాది వాట్సాప్‌లో వచ్చిన బెస్ట్ ఫీచర్లివే!
X

మెసేజింగ్ యాప్ వాట్సాప్.. ఈ ఏడాది ఎన్నో కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. వీటిలో ప్రైవసీ, మీడియా, యూజబిలిటీ.. ఇలా పలురకాల ఫీచర్లున్నాయి. అయితే ఈ ఏడాది వాట్సాప్‌లో వచ్చిన కొన్ని బెస్ట్ ఫీచర్లేంటంటే.

వాట్సాప్ ఈ ఏడాది తీసుకొచ్చిన బెస్ట్ ఫీచర్లలో ‘ఫుల్ రెజల్యూషన్‌ మీడియా షేరింగ్’ ఫీచర్ ఒకటి. అంతకుముందు వాట్సాప్ ద్వారా ఏదైనా ఫొటో/వీడియో పంపాలంటే డాక్యుమెంట్ రూపంలో పంపాల్సివచ్చేది. అయితే ఈ ఏడాది వాట్సాప్ హెచ్‌డి ఫోటో, వీడియో షేర్ ఆప్షన్‌ను తెచ్చింది. దీంతో యూజర్లు ఒరిజినల్ క్వాలిటీ ఫోటోలను డైరెక్ట్‌గా షేర్ చేసుకోగలుగుతున్నారు.

ఈ ఏడాది వాట్సా్ప్ తీసుకొచ్చిన మరో మంచి ఫీచర్.. ‘ఎడిట్ మెసేజెస్’. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు పంపిన్ మెసేజ్ ను 15 నిమిషాలలోపు ఎడిట్ చేసుకునే వీలుంటుంది.

వాట్సాప్ తీసుకొచ్చిన ఫీచర్లలో మరో ముఖ్యమైన ఫీచర్.. ‘చాట్ లాక్’. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు వ్యక్తిగత ఛాట్స్‌ను ఎవరికీ కనిపించకుండా హైడ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.

ఈ ఏడాది అందుబాటులోకి వచ్చిన ‘పాస్‌కీ’ అనే ఫీచర్ వాట్సాప్‌ సెక్యూరిటీని మరింత పటిష్టం చేసింది. ఈ ఫీచర్ ద్వారా యాప్‌ను మరింత సెక్యూర్డ్‌గా ఉంచుకోవచ్చు.

ఇక ఈ సంవత్సరం వాట్సాప్ యాప్‌లో రెండు వేర్వేరు ఖాతాలను ఉపయోగించుకునేలా ‘మల్టిపుల్ అకౌంట్ ఫీచర్’ను కూడా తీసుకొచ్చింది. రెండు సిమ్ కార్డ్‌లను ఉపయోగించే యూజర్లకు ఇది యూజ్ ఫుల్‌గా ఉంటుంది.

వీటితోపాటు వాయిస్ స్టేటస్, పిన్ మెసేజెస్ ఇన్ చాట్, సైలెన్స్ అన్‌నోన్ కాల్స్, సరికొత్త లేఅవుట్ డిజైన్, స్క్రీన్ షేరింగ్ వంటి పలు ఇంట్రెస్టింగ్ ఫీచర్లను కూడా ఇదే ఏడాది ప్రవేశపెట్టింది వాట్సాప్.

ఇకపోతే త్వరలో వాట్సాప్ నుంచి మరో ఫీచర్ రాబోతుంది. వాట్సాప్ ఛానెల్స్‌లో ‘ఆటోమేటిక్ ఆల్బమ్‌’ అనే కొత్త ఫీచ‌ర్ అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్‌‌తో ఛానెల్స్‌ యూజర్లు మీడియాను ఒకేచోట ఆర్గనైజ్ చేసుకోవచ్చు.

First Published:  22 Dec 2023 1:21 PM IST
Next Story