Telugu Global
Science and Technology

వాట్సప్‌ లో కొత్త ఫీచర్‌ ' రివర్స్‌ ఇమేజ్‌ సెర్చ్‌'

వాట్సప్‌ ద్వారా షేర్‌ చేసే కంటెంట్‌కు పారదర్శకతను మెరుగుపరచడమే ఈ ఫీచర్‌ లక్ష్యం

వాట్సప్‌ లో కొత్త ఫీచర్‌  రివర్స్‌ ఇమేజ్‌ సెర్చ్‌
X

యూజర్ల భద్రతను దృష్టిలో పెట్టుకుని వారికి ఎప్పటికప్పుడు మెరుగైన ఫీచర్లు అందించడంలో భాగంగా ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ కొత్త ఫీచర్లను తీసుకొస్తున్నది. స్పామ్‌ కాల్స్‌కు చెక్‌ పెట్టడానికి కొన్ని ఫీచర్స్‌ను తీసుకొచ్చిన ఈ ప్లాట్‌ ఫామ్‌ తాజాగా ఇమేజ్‌ల మూలాలను గుర్తించే పనిలో పడింది. దీనికోసం రివర్స్‌ ఇమేజ్‌ సెర్చ్‌ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. వాట్సప్‌లోని ఫొటోల కోసం మేసేజింగ్‌ యాప్‌ ‘‘Search on web’’ ఆప్షన్‌ను తీసుకొచ్చింది. దీని సాయంతో వాట్సప్‌లోనే నేరుగా ఇమేజ్‌ గురించి సెర్చ్‌ చేయవచ్చు. ప్లాట్‌ఫామ్‌లో నేరుగా ఈ ఆప్షన్‌ను తీసుకొచ్చింది. దీని సాయంతో వాట్సప్‌లోనే నేరుగా ఇమేజ్‌ గురించి సెర్చ్‌ చేయవచ్చు. ప్లాట్‌ఫామ్‌లో నేరుగా ఈ ఆప్షన్‌ అందుబాటులో ఉంటుంది కాబట్టి.. ఇతర యాప్‌ లేదా బ్రౌజర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. వాట్సప్‌ ద్వారా షేర్‌ చేసే కంటెంట్‌కు పారదర్శకతను మెరుగుపరచడమే ఈ ఫీచర్‌ లక్ష్యం.

ఎలా ఉపయోగించాలి?

వాట్సప్‌ చాట్‌లో ఇమేజ్‌ను ఓపెన్‌ చేయగానే పైన కుడివైపున త్రీ డాట్స్‌ మెనూ కనిపిస్తుంది. దాన్ని క్లిక్‌ చేయగానే పలు ఆప్షన్లు దర్శనమిస్తాయి. అందులో ‘‘Search on web’’ అని ఆప్షన్‌ కనిపిస్తుంది. దాన్ని క్లిక్‌ చేయగానే ఒక పాపప్‌ ఓపెన్‌ అవుతుంది. అందులో ‘Search’’ పై క్లిక్‌ చేసి రివర్స్‌ ఇమేజ్‌ సెర్చ్‌ను మొదలుపెట్టవచ్చు. అయితే ఇలా వెబ్‌ సెర్చ్‌ కోసం గూగుల్‌కు పంపే ఫొటోల గోప్యంగా ఉంటాయని, మెటాతో షేర్‌ అవ్వవని వాబీటా ఇన్ఫో స్పష్టం చేసింది. ఇక ఇమేజ్‌ గురించి సెర్చ్‌ చేయగానే దానికి సంబంధించిన మూలం, ఆ ఫొటో ఎక్కడి నుంచి వచ్చింది, ఆన్‌లైన్‌లో ఈ ఫొటో వినియోగించిన ఇతర సందర్బాలు.. ఇలా అన్నీ కనిపిస్తాయి. అంతేకాదు ఆ ఫొటోను ఎడిట్‌ చేశారా? తప్పుదారి పట్టించేలా మార్చాలా అనే విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు. కచ్చితత్వాన్ని అంచనా వేయడం ఈజీ కానున్నది. మొదటి బీటా యూజర్లకు ఈ ఫీచర్‌ అందుబాటులోకి రానున్నదని వాబీటా ఇన్ఫో తన బ్లాగ్‌లో పంచుకున్నది. సంబంధిత ఫొటోను పోస్ట్‌ చేసింది. రానున్న వారాల్లో ఇది అందరికీ అందుబాటులోకి రానున్నదని వెల్లడించింది.

First Published:  6 Nov 2024 3:05 PM IST
Next Story