చంద్రబాబుకు రేవంత్ ఫోన్.. ఏం మాట్లాడుకున్నారంటే!
ఈనెల 12న జరిగే చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి రేవంత్ రెడ్డికి ఆహ్వానం ఉంటుందని సమాచారం. ఆహ్వానం వస్తే.. అధిష్టానం అనుమతి తీసుకుని హాజరవుతానని రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు.
BY Telugu Global6 Jun 2024 4:46 PM IST

X
Telugu Global Updated On: 6 Jun 2024 4:46 PM IST
టీడీపీ అధినేత, ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫోన్ చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో చంద్రబాబుకు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగించాలని చంద్రబాబును కోరారు రేవంత్ రెడ్డి. విభజన చట్టానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలను స్నేహపూర్వక వాతావరణంలో పరిష్కరించుకుందామని చంద్రబాబుకు ప్రతిపాదించారు.
మరోవైపు ఈనెల 12న జరిగే చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి రేవంత్ రెడ్డికి ఆహ్వానం ఉంటుందని సమాచారం. ఆహ్వానం వస్తే.. అధిష్టానం అనుమతి తీసుకుని హాజరవుతానని రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు.
Next Story