Samsung Galaxy F34 5G | గరిష్ట బ్యాటరీ కెపాసిటీ.. హై రిజల్యూషన్ కెమెరాతో విపణిలోకి త్వరలో శాంసంగ్ గెలాక్సీ ఎఫ్34 5జీ
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్34 5జీ (Samsung Galaxy F34 5G) ఫోన్ 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ ప్లే (Super AMOLED display) విత్ 120 హెర్ట్జ్ కలిగి ఉంటుంది.
Samsung Galaxy F34 5G | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ శాంసంగ్.. భారత్ మార్కెట్లోకి ప్రీమియం సెగ్మెంట్ స్మార్ట్ ఫోన్ తేనున్నది. తన ఎఫ్ సిరీస్‌లో `శాంసంగ్ గెలాక్సీ ఎఫ్34 5జీ (Samsung Galaxy F34 5G)` స్మార్ట్ ఫోన్ త్వరలో ఆవిష్కరించనున్నది. అత్యంత గరిష్ట సామర్థ్యం గల 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోందంటూ శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్‌లో మైక్రోసైట్ సృష్టించింది. సింగిల్ చార్జింగ్‌తో రెండురోజుల బ్యాటరీ లైఫ్ ఉంటుందని శాంసంగ్ ప్రకటించింది. ఇందుకోసం శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్‌లో మైక్రో సైట్ క్రియేట్ చేసింది.
ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) ప్లస్ `రిడిఫైన్ స్మార్ట్ ఫోన్ ఫొటోగ్రఫీ`తో హై రిజల్యూషన్‌తో కూడిన 50-మెగా పిక్సెల్స్ ప్రైమరీ సెన్సర్ ప్లస్ ఎల్ఈడీ ఫ్లాష్‌తో త్రిపుల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఫన్ మోడ్ విత్ 16 డిఫరెంట్ ఇన్‌బిల్ట్ లెన్స్ ఎఫెక్ట్స్, సింగిల్ టేక్, డిఫరెంట్ ఫొటోగ్రఫీ, వీడియో గ్రఫీ ఫీచర్లకు సపోర్ట్‌గా ఉంటుంది. సింగిల్‌షాట్‌లో నాలుగు వీడియోలు, నాలుగు ఫొటోలు క్యాప్చర్ కెపాసిటీ ఈ ఫోన్ సొంతం.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్34 5జీ (Samsung Galaxy F34 5G) ఫోన్ ఆవిష్కరణ తేదీ ప్రకటించలేదు. వాల్‌మార్ట్ అనుబంధ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ లభ్యమవుతుందని తెలిపింది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్34 5జీ (Samsung Galaxy F34 5G) ఫోన్ 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ ప్లే (Super AMOLED display) విత్ 120 హెర్ట్జ్ కలిగి ఉంటుంది. విజన్ బూస్టర్ టెక్నాలజీ (Vision Booster technology)తో ఫోన్ స్క్రీన్ రూపుదిద్దుకుంటుంది. 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ (Nits peak brightness)తోపాటు గొరిల్లా గ్లాస్-5 ప్రొటెక్షన్ ఉంటుందని భావిస్తున్నారు.
తన గెలాక్సీ ఏ34 5జీ ఫోన్‌ను శాంసంగ్ రీ బ్రాండ్ చేసి శాంసంగ్ గెలాక్సీ ఎఫ్34 5జీగా తీసుకొస్తున్నదని వార్తలొచ్చాయి. శాంసంగ్ ఏ34 5జీ ఫోన్ విత్ 128 జీబీ రామ్ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్ ధర రూ.30,999 నుంచి మొదలైంది. త్వరలో వచ్చే శాంసంగ్ ఎఫ్34 5జీ ఫోన్ ధర ఎక్కువగానే ఉంటుందని సమాచారం.