Telugu Global
NEWS

హరీష్ రావు సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై ఆర్కేపూడి గాంధీ అనుచరుల దాడిని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తోంది.

హరీష్ రావు సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్
X

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై ఆర్కేపూడి గాంధీ అనుచరుల దాడిని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తోంది. ఘటన జరిగిన తర్వాత మాజీ మంత్రి హరీష్ ఆధ్వర్యంలో పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు సైబరాబాద్ సీపీ ఆఫీస్ కు వెళ్లారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని, హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ఘటనా స్థలిలో నిర్లక్ష్యంగా ఉన్న పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇదే అంశంపై సీపీ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. దాదాపు నాలుగు గంటలు బీఆర్ఎస్ నేతలు సీపీ ఆఫీస్ దగ్గర బైఠాయించారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోకపోతే ఇక్కడ కదిలేది లేదని తేల్చి చెప్పారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది.

పోలీసులు పక్షపాత ధోరణిగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు వాగ్వాదానికి దిగారు. పీఏసీ ఛైర్మన్‌ అరెకపూడి గాంధీని విడుదల చేయడంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. అరెకపూడిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఆందోళనకు దిగిన హరీశ్‌రావుతో పాటు పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. వేముల ప్రశాంత్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్‌తో పాటు పలువురు నేతలను బలవంతంగా లాక్కెళ్లి వాహనాల్లో ఎక్కించారు. ఈ క్రమంలో హరీష్ రావు చేయికి తీవ్ర గాయమైనట్టు తెలుస్తోంది.


First Published:  12 Sep 2024 2:53 PM GMT
Next Story