ఢిల్లీ సీఎం పోస్టుపై హైకమాండ్ నిర్ణయమే ఫైనల్
అది మాకు పెద్ద సమస్య కాదన్నబీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీ గాలి వీస్తున్నది. ఎగ్జిట్‌పోల్స్ అంచనాలకు అనుగుణంగానే ఫలితాల సరళి కనిపిస్తున్నది. ఆప్‌తో పోలీస్తే బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో సీఎం పోస్టుపై బీజేపీకి ఓ ప్రశ్న ఎదురైంది.
దీనిపై బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ ఆప్‌పై విమర్శలు చేశారు. ఢిల్లీ సీఎం పోస్టుపై అగ్రనాయకత్వం నిర్ణయమే ఫైనల్. అది మాకు పెద్ద సమస్య కాదు. మోసగించే వారికి ప్రజలు ఇలాంటి ఫలితాన్నే ఇస్తారు అని ధ్వజమెత్తారు. పార్టీ కార్యకర్తలు ఎంతో శ్రమించారు. ఢిల్లీ సమస్యలు ఆధారంగా మేం ఎన్నికల్లో పోరాడం. కానీ అరవింద్ కేజ్రీవాల్ సమస్యల నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు.
ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో బీజేపీ మెజార్టీ మార్క్‌ను దాటింది. అయితే ఇప్పటికీ ఆప్, బీజేపీల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతున్నది. మొదట ఫలిలాత సరళిలో కొద్దిగా వెనుకబడిన ఆప్ మళ్లీ పుంజుకున్నది. ప్రస్తుతం ఆప్ 28, బీజేపీ 42 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. కాంగ్రెస్ ఖాతాకూడా తెరిచే పరిస్థితి లేనట్టు కనిపిస్తున్నది.