ఢిల్లీలో వెలువడుతున్న ఎన్నికల ఫలితాలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్‌పై సెటైర్లు వేశారు. కంగ్రాట్స్ రాహుల్ గాంధీ అంటూ ఎద్దేవా చేశారు. రాహుల్ మరోసారి బీజేపీని గెలిపించారని పేర్కొన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఇప్పటివరకు ఖాతా తెరువలేదు. ఇప్పటివరకు బీజేపీ 43 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తుండగా.. ఆప్ 27 స్థానాల్లో ముందంజంలో ఉన్నది.
Add A Comment