ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ఎవరంటే?
ఢిల్లీ సీఎం ఎవరనే సస్పెన్స్ వీడింది.
BY Vamshi Kotas19 Feb 2025 8:10 PM IST

X
Vamshi Kotas Updated On: 19 Feb 2025 8:11 PM IST
ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తను బీజేపీ శాసనసభ పక్షం ఎన్నుకుంది. ఈమే రేపు కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు రామ్‌లీలా మైదానంలో జరిగే కార్యక్రమంలో ఆమె ఢిల్లీ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారు. ఆమె షాలిమార్ బాగ్ నుండి ఎన్నికల్లో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరవుతారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. ఢిల్లీ సీఎం ఎంపిక కోసం కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్, బీజేపీ జాతీయ కార్యదర్శి ఓపీ దన్కర్‌ను బీజేపీ అధిష్టానం నియమించింది.
Next Story