వయనాడ్‌లో ప్రియాంకపై పోటీ చేసిది ఎవరంటే?
కేరళలోని వాయనాడ్‌లో లోక్ సభ ఉప ఎన్నికకు భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్ధిని ప్రకటించింది. నవ్యహరిదాస్ పేరును బీజేపీ అధిష్టానం ప్రకటించింది.
కేరళలోని వాయనాడ్‌లో లోక్ సభ ఉప ఎన్నికకు భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్ధిని ప్రకటించింది. నవ్యహరిదాస్ పేరును బీజేపీ అధిష్టానం ప్రకటించింది.ప్రస్తుతం ఆమె కేరళ రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అస్సాం, బీహార్, చత్తీస్‌ఘడ్, కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమబెంగాల్‌లో ఖాళీగా ఉన్న అసెంబ్లీ బైపొల్‌కు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. మరోవైపు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కోసం 66 స్థానాలకు అభ్యర్థుల పేర్లతో బీజేపీ తొలి జాబితాను విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రియాంక గాంధీ బరిలో ఉన్న సంగతి తెలిసిందే. నవంబర్ 13న ఉప ఎన్నిక జరగనుంది. అదే నెల 23న ఫలితాలు వెలువడనున్నాయి.
రాష్ట్ర బీజేపీ చీఫ్ బాబూలాల్ మరాండీకి ధన్వార్ స్థానాన్ని కేటాయించారు. జాంతారా నుంచి సీతా సోరెన్, సరైకెల్లా నుంచి చంపై సోరెన్, జగన్నాథ్‌పూర్ నుంచి గీతా కోడా, పొట్కా నుంచి మీరా ముండాలను కమలదళం బరిలోకి దింపింది. ఇతర కీలక అభ్యర్థుల్లో లోబిన్ హేమ్‌బ్రోం (బోరియో), గీతా బాల్ముచు (ఛాయ్‌బాసా) తదితరులు ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 81 అసెంబ్లీ సీట్లు ఉండగా, బీజేపీకి 68 సీట్లను కేటాయించారు. 66 సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన కమలం పార్టీ మిగతా ఇద్దరి పేర్లను రేపోమాపో ప్రకటించే ఛాన్స్ ఉంది.