Telugu Global
National

సీఎం తినాల్సిన సమోసాలు ఎవరు తిన్నారు.. సీఐడీ దర్యాప్తుకు ప్రభుత్వం ఆదేశం

సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు తినాల్సిన సమోసాలు ఆయన వద్దకు చేరకుండానే మాయమైపోయాయి. దీనిపై ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది.

సీఎం తినాల్సిన సమోసాలు ఎవరు తిన్నారు.. సీఐడీ దర్యాప్తుకు ప్రభుత్వం ఆదేశం
X

హిమాచల్‌ ప్రదేశ్‌ రాజకీయాల్లో సమోసాలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. ఒక సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు తినాల్సిన సమోసాలు ఆయన వద్దకు చేరకుండానే మాయమైపోయాయి. దీంతో అధికారులకు కోపం వచ్చింది. సీఎంకి కూడా తన సమోసాలు పోయాయని తెలియగానే ఆగ్రహంతో ఏకంగా సీఐడీ విచారణకు ఆదేశించి సమోసా దొంగలను పట్టుకోవాలని ఆదేశించారు. ఇంకేముంది అధికారులు రంగంలోకి దిగిపోయారు.ఈ విషయం తెలియడంతో బీజేపీ నాయకులు సుక్కూను కార్నర్ చేయడం మొదలుపెట్టారు. ‘ప్రజల కష్టాల గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించకుండా సమోసాలు పోయాయని సీఐడీ ఎంక్వైరీ వేస్తారా?’ అంటూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇక ఈ విషయం సోషల్ మీడియాకు చేరడంతో అక్కడ కూడా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని, సీఎం సుక్కూను నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

దీనిపై సీఎంను మీడియా ప్రశ్నిస్తే.. సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. దీంతో ఈ వ్యవహారంపై దర్యాప్తు మొదలైంది. ఐదుగురు పోలీసులకు షోకాజ్ నోటీసులు కూడా అందాయి. కఠినమైన క్రమశిక్షణా చర్యలు ఉంటాయని నోటీసుల్లో హెచ్చరించారు. ఈ మేరకు విచారణ జరుగుతోంది.ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. అక్టోబర్ 21న సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు రాష్ట్ర సీఐడీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. అక్కడ సైబర్ వింగ్ స్టేషన్‌ను ప్రారంభించారు.ఆ కార్యక్రమంలో సీఎంకు వడ్డించేందుకు ప్రత్యేకంగా, వేడివేడి సమోసాలు తీసుకొచ్చారు. ప్రత్యేకంగా బాక్సుల్లో తెప్పించారు. అయితే ముఖ్యమంత్రికు అందించకముందే ఆయన సిబ్బంది అందరికీ పంచిపెట్టారు.నిజానికి ఈ సమోసాలు సీఎంకు మాత్రమే అందించాలనే విషయం ఒక్క ఎస్‌ఐకి మాత్రమే తెలుసని విచారణలో తేలింది.

First Published:  8 Nov 2024 3:16 PM IST
Next Story