Telugu Global
National

భారీగా లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వాల్తేరు డీఆర్ఎం

వాల్తేరు రైల్వే డివిజన్ డీఆర్ఎం సౌరభ్ ప్రసాద్‌ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు

భారీగా లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వాల్తేరు డీఆర్ఎం
X

విశాఖ వాల్తేరు రైల్వే డివిజన్ డీఆర్ఎం సౌరభ్ ప్రసాద్‌‌ ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.25 లక్షలు లంచం తీసుకుంటుండగా సీబీఐ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ప్రస్తుతం సెలవులో ఉన్న డీఆర్‌ఎం లంచం డబ్బును ముంబైలో తన ఇంటికి వచ్చి ఇవ్వాలని సూచించాడు. దీంతో అయితే మెకానికల్ బ్రాంచ్ పనులుకి టెండర్ వ్యవహారంలో ఓ కాంట్రాక్టర్‌ నుంచి రూ.25 లక్షల లంచం డిమాండ్‌ చేశారు. దీంతో సదరు కాంట్రాక్టర్‌ సౌరబ్‌కు డబ్బులు ముట్ట జెప్పేందుకు సిద్ధమయ్యారు. కానీ ప్లాన్‌ ప్రకారం.. సదరు కాంట్రాక్టర్‌ ముడుపుల వ్యవహారంపై సీబీఐ అధికారులు సమాచారం ఇచ్చారు.

పక్కా సమాచారంతో కాంట్రాక్టర్‌ నుంచి రూ.25 లక్షలు లంచం తీసుకుంటుండగా సీబీఐ అధికారులు డీఆర్‌ఎం సౌరబ్‌ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న సీబీఐ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఇదేక్రమంలో ఇటు విశాఖలోని డీఆర్ఎం బంగ్లాలో సీబీఐ సీబీఐ సోదాలు జరిపింది. ఢిల్లీ, విశాఖకు చెందిన రెండు బృందాలు ఈ సోదాలు నిర్వహించినట్లు సమాచారం. ఈ సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. లంచం తీసుకుంటూ దొరికిపోయిన డీఆర్ఎం సౌరభ్ ప్రసాద్‌ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇండియన్ రైల్వే చరిత్రలో లంచం తీసుకుంటూ పట్టుబడిన 2వ డీఆర్‌ఎం సౌరభ్ ప్రసాద్‌‌.

First Published:  17 Nov 2024 4:36 PM IST
Next Story