Telugu Global
National

రాష్ట్రాలకు పన్నుల వాటాను రిలీజ్ చేసిన కేంద్రం..తెలుగు రాష్ట్రాలకు ఎంతంటే!

కేంద్రం రాష్ట్రాలకు పన్నుల వాటా విడుదల చేసింది. ఏపీకి పన్నుల వాటా రూపంలో రూ.7,211 కోట్లు దక్కనుండగా.. తెలంగాణకు రూ.3,745 కోట్లు లభించాయి.

రాష్ట్రాలకు పన్నుల వాటాను రిలీజ్ చేసిన కేంద్రం..తెలుగు రాష్ట్రాలకు ఎంతంటే!
X

కేంద్రం ప్రభుత్వం రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల వాటాను విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలకు అందించే నెలవారీ పన్నుల వాటా రూ.89,086.50 కోట్లు కాకుండా..ఈసారి రూ.1,78,173 కోట్ల మేర పన్నుల వాటా విడుదల చేసినట్టు ఎన్డీయే సర్కార్ ఇవాళ ఒక ప్రకటనలో పేర్కొన్నాది. అత్యధికంగా యూపీకి రూ.31,962 కోట్ల మేర పన్నుల వాటా కేటాయించారు. ఏపీకి పన్నుల వాటా రూపంలో రూ.7,211 కోట్లు దక్కనుండగా.. తెలంగాణకు రూ.3,745 కోట్లు లభించనున్నాయి.

బీహార్ కు రూ.17,921 కోట్లు, మధ్యప్రదేశ్ కు 13,987 కోట్లు, మహారాష్ట్రకు రూ.11,255 కోట్లు, పశ్చిమ బెంగాల్ కు రూ.13,404 కోట్లు, రాజస్థాన్ కు రూ.10,737 కోట్లు, ఒడిశాకు రూ.8,068 కోట్లు పన్నుల వాటా రూపేణా దక్కనున్నాయి. పండుగల దష్ట్యా రాష్ట్రాల అభివృద్ధి, మూల ధన వ్యయానికి ఊతమిచ్చేందుకు ఈ ఫండ్స్ ఉపయోగపడతాయని కేంద్రం భావిస్తోంది.

First Published:  10 Oct 2024 4:44 PM IST
Next Story