Telugu Global
National

ప్రధాని మోదీ విమానంలో సాంకేతిక సమస్య

భారత ప్రధాని నరేంద్రమోడీ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. జార్ఖండ్ డియోఘర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.

ప్రధాని మోదీ విమానంలో సాంకేతిక సమస్య
X

ప్రధాని మోదీ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని, తిరిగి ఢిల్లీకి వచ్చే సమయంలో విమానంలో టెక్నికల్ స్నాగ్ ఏర్పడింది. జార్ఖండ్ డియోఘర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ప్రధాని ఢిల్లీకి తిరిగి రావడం ఆలస్యం కానుంది. గిరిజనుల ఐకాన్ బిర్సా ముండా వార్షికోత్సవాన్ని జన జాతీయ గౌరవ్ దివస్ జరుపుకునేందుకు.. దీంతో పాటు నవంబర్ 20న జార్ఖండ్ రాష్ట్రంలో జరగబోయే రెండో విడత అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తర్వాత, తిరిగి ఢిల్లీకి బయలుదేరినప్పుడు ఈ సమస్య తలెత్తింది.

సాంకేతిక లోపాన్ని సరిచేసే ప్రక్రియ పూర్తయ్యే వరకు విమానం అక్కడే నిలిపివేశారు. ఈ కారణంగా ప్రధాని ఢిల్లీకి చేరుకోవడం కొద్దిగా ఆలస్యం కానుంది. ఇవాళ ప్రధాని మోడీ రెండు ర్యాలీల్లో ప్రసంగించారు. మరోవైపు, ఇదే రోజున ఝార్ఖండ్‌ పర్యటనలో ఉన్న లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ హెలికాప్టర్‌ కూడా గంటకు పైగా నిలిచిపోయింది. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ నుంచి అనుమతి రాకపోవడంతో గోడ్డాలో ఆగిపోయింది. దీంతో రాహుల్‌ షెడ్యూల్‌కు ఆటంకం ఏర్పడింది. అయితే, దీనికి బీజేపీనే కారణమని కాంగ్రెస్‌ ఆరోపించింది. ఝార్ఖండ్‌లో ఈ నెల 13న తొలి విడత పోలింగ్‌ జరగ్గా.. నవంబరు 20న మహారాష్ట్రతో పాటు రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. నవంబరు 23న ఫలితాలను వెల్లడించనున్నారు.

First Published:  15 Nov 2024 4:18 PM IST
Next Story