Telugu Global
National

సిబిల్‌ స్కోర్‌ తక్కువ ఉందని పెళ్లి కాన్సిల్

వరుడి సిబిల్‌ స్కోర్‌ సరిగ్గా లేదని పెళ్లి రద్దు చేశారు

సిబిల్‌ స్కోర్‌  తక్కువ ఉందని పెళ్లి కాన్సిల్
X

మామూలుగా అమ్మాయి పెళ్లి చేసే ముందు ఆడ పిల్లల ఫ్యామిలీ సభ్యులు అమ్మాయి మంచివాడా ఆస్తిపాస్తులు ఉన్నాయా, కుటుంబం ఎలాంటిది మొదలైన విషయాలను చెక్‌ చేస్తుంటారు. ఒకవేళ వరుడు మంచివాడు కాదని.. చెడు అలవాట్లు ఉన్నాయని తేలితే వధువు తరఫున బంధువులు ఆ వివాహం కాన్సిల్ చేసుకున్న ఘటనలను మనం చూస్తూనే ఉంటాం. అయితే ఇటీవల వరుడి సిబిల్‌ స్కోర్‌ సరిగ్గా లేదని వివాహాన్ని రద్దు చేసిన వైనం మహారాష్ట్రలో జరిగింది.

మహారాష్ట్రలోని ముర్తిజాపూర్‌కు చెందిన ఓ యువతికి అదే ప్రాంతానికి చెందిన ఓ యవకుడితో పెద్దలు పెళ్లి సంబంధం కుదిర్చారు. మ్యారేజ్‌కి కావాల్సిన అన్ని విషయాలు మాట్లాడుకొని తేదీ సైతం ఖరారు చేశారు. అయితే వివాహానికి కొన్ని రోజుల ముందు వధువు మేనమామ వరుడి సిబిల్‌ స్కోర్‌ను చెక్‌ చేయగా అతడు అనేక బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా సిబిల్‌ స్కోర్‌ కూడా తక్కువ ఉండడంతో వారు ఈ పెళ్లికి నిరాకరించారు. అది చూసి అతను కాబోయే భార్యకు ఆర్ధిక భద్రత కల్పించలేదని పెళ్లిని రద్దు చేసుకున్నారు.

First Published:  8 Feb 2025 2:54 PM IST
Next Story