పీఎం కిసాన్ నిధులు విడుదల
పీఎం కిసాన్ నిధులు ఇవాళ బీహార్‌లో భాగల్పూర్ లో ప్రధాని మోదీ విడుదల చేశారు.
BY Vamshi Kotas24 Feb 2025 3:49 PM IST

X
Vamshi Kotas Updated On: 24 Feb 2025 3:49 PM IST
దేశంలో అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పీఎం కిసాన్ 19వ విడత నిధులను ప్రధాని మోదీ విడుదల చేశారు. బీహార్‌లోభాగల్పూర్ లో జరుగనున్న ఒ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. ఆ కార్యక్రమంలోనే 19వ విడత రైతులకు రూ.22 వేల కోట్ల పీఎం కిసాన్ నిధుల విడుదల చేయనున్నారు. ఈ పథకం కింద రూ.2 వేలు చొప్పున 3 దఫాలుగా రూ.6 వేలు ఒక్కో రైతుకు కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తోంది. 2019లో ప్రారంభం అయిన ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 18 విడతల్లో రూ.3.46 లక్షల కోట్లు రైతుల అకౌంట్లలో కేంద్రం జమ చేసింది. అన్నదాత సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని తెలిపారు. అనంతరం పలు సంక్షేమ పధకాలను మోదీ ప్రారంభించారు.
Next Story