భద్రతా బలగాలతో ప్రధాని దీపావళి వేడుకలు
దీపావళి సందర్బంగా ఇవాళ గుజరాత్‌లోని కచ్ లో ఉన్న భద్రతా బలగాల స్థావరాన్ని ప్రధాని మోదీ సందర్శించారు. సైనికులకు స్వీట్లు పంచిపెట్టారు.
దీపావళి వేడుకల్ని గుజరాత్‌లోని కచ్ లో ఉన్న భద్రతా బలగాల మధ్య ప్రధాని మోదీ జరుపుకున్నారు. సర్ క్రీక్‌లోని లక్కీ నాలా వద్ద బీఎస్‌ఎఫ్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సిబ్బందిని కలిశారు. ఆర్మీ యూనిఫాం ధరించి సైనికులతో గడిపారు. అక్కడున్న సైనికులకు ఆయన పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా ప్రధాని సైనికులకు స్వీట్లు పంచిపెట్టారు.
కాగా 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాల్లోని సైనికులతో కలిసి ప్రధాని మోదీ దీపావళి వేడుకలు జరుపుకుంటున్నారు. 2014లో సియాచిన్, 2015లో పంజాబ్ సరిహద్దు, 2016లో హిమాచల్ ప్రదేశ్‌లోని సుమ్డో, 2017లో జమ్మూ కాశ్మీర్‌లోని గురేజ్ సెక్టార్, 2018లో ఉత్తరాఖండ్‌లోని హర్సిల్, 2019లో జమ్మూ కశ్మీర్‌లోని రాజౌరీ, 2020లో రాజస్థాన్‌లోని లాంగేవాలా, 2021లో కశ్మీర్‌లోని నౌషేరాలో, 2022 జమ్మూ కశ్మీర్‌లోని కార్గిల్‌లో, 2023 హిమాచల్‌లోని లెప్చాలో సైనికులతో కలిసి దీపావళి వేడుకలు చేసుకున్నారు.