నేడు కువైట్‌లో కొనసాగుతున్న ప్రధాని మోదీ పర్యటన
కువైట్‌లో ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటన భాగంగా మొదటి రోజు పర్యటన కొనసాగుతుంది.
కువైట్‌లో ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటన భాగంగా మొదటి రోజు పర్యటన కొనసాగుతుంది. ఇవాళ అక్కడికి చేరుకున్న ఆయనకు కువెట్ దేశం ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. ప్రవాస భారతీయులు కూడా పెద్ద ఎత్తున ప్రధానికి వెల్‌కమ్ చెప్పారు. అనంతరం కువైట్ సిటీలో మాజీ ఐఎఫ్ఎస్ అధికారి 101 ఏళ్ల మంగళ్ సేన్ హండాను కూడా ప్రధాని మోదీ కలిశారు. ప్రధాని మోదీ కువైట్ రాకతో అక్కడ నివసిస్తున్న ప్రవాసాంధ్రుల్లో ఆనందం వెల్లివిరిసింది. ప్రధాని నరేంద్ర మోదీ రాక గర్వించదగిన క్షణం. ఇది భారతీయుల పెద్ద విజయం అంటూ ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలియజేశారు. 43 ఏళ్ల తర్వాత భారత ప్రధాని కువైట్‌లో పర్యటించడం విశేషం. గతంలో ఇందిరా గాంధీ కువైట్‌లో పర్యటించారు. భారతదేశం- కువైట్ మధ్య సంబంధాలు స్నేహపూర్వకంగా ఉన్నాయి. రక్షణ, భద్రతా సహకారాన్ని బలోపేతం చేయడం ఈ పర్యటనలో ప్రధానాంశంగా ఉంటుందని భారత అధికారులు తెలిపారు.
ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం, రక్షణ సహకార ఒప్పందం కోసం కువైట్‌తో చర్చలు జరుగుతున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.ల మధ్య వాణిజ్యం, ఇంధనం, సంస్కృతిక సంబంధాలు పురోగమిస్తాయని భావిస్తున్నారు. 1981లో నాటి భారత ప్రధాని ఇందిరా గాంధీ కువైట్‌లో పర్యటించారు. అనంతరం 2009లో నాటి భారత ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ ఆ దేశంలో పర్యటించారు. ఈ నేపథ్యంలో జీసీసీలో భారత్ కీలక భాగస్వామిగా ఉంది. దీంతో 2022- 23 ఆర్థిక సంవత్సరంలో ఈ రెండు దేశాల మధ్య రూ.184. 46 యూఎస్ బిలియన్ డాలర్ల విలువైన ద్వైపాక్షిక వాణిజ్యం జరిగింది. అలాగే గత ఆర్థిక సంవత్సరం.. అంటే 20230-24 మధ్య ఈ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం రూ. 10.47 బిలియన్ యూఎస్ డాలర్లకు చేరుకుంది.ఈ పర్యటనలో భాగంగా రక్షణ సహకారంతోపాటు ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం కారణంగా భారత్ కువైట్ దేశాల మధ్య భాగస్వామ్యం కొత్త పుంతలు తొక్కుతోందని భారత విదేశీ వ్యవహారాల శాఖలోకి ఉన్నతాధికారి అరుణ్ కుమార చటర్జీ పేర్కొన్నారు.