Telugu Global
National

పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన ప్రధాని మోదీ

దేశవ్యాప్తంగా 9.4 కోట్ల మంది రైతుల బ్యాంక్ అకౌంట్లలో రూ.20వేల కోట్లను జమ చేసేలా.. పీఎం కిసాన్ పథకం 18వ విడత నిధులను ముంబైలోప్రధాని మోదీ విడుదల చేశారు.

పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన ప్రధాని మోదీ
X

మహారాష్ట్రలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ 18వ విడత ప్రధాన మంత్రి కిసాన్ యోజన నిధులు విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న 9.4కోట్ల మందికిపైగా రైతులు ఖాతల్లో రూ.2వేల చొప్పున రూ. వేల కోట్లను డిపాజిట్ చేశారు. రైతులకు పంటలకు పెట్టుబడి సాయాన్ని అందించేందుకు మోదీ 2019లో ఈ పథకాన్ని ప్రారంభించారు.

ముంబైలో అండర్ గ్రౌండ్ మెట్రో ప్రారంభం సందర్భంగా ప్రధాని నిధులను రిలీజ్ చేశారు.పీఎం కిసాన్ 17న విడత నిధులను ప్రధాని మోదీ.. జూన్‌లో రిలీజ్ చేశారు. మళ్లీ నాలుగు నెలల తర్వాత.. సరిగ్గా రబీ సీజన్ మొదలవుతున్న సమయంలో.. ఒక్కో రైతు అకౌంట్‌లోకీ రూ.2,000 చొప్పున మనీ జమ చేశారు. ఇప్పుడు ఆ మనీతో రైతులు.. పంటకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు కొనుక్కునేందుకు వీలవుతుంది. పీఎం కిసాన్ (https://pmkisan.gov.in) పోర్టల్‌లోకి లాగిన్ చెక్ చేసుకోవచ్చును

First Published:  5 Oct 2024 2:50 PM IST
Next Story