అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్‌కు ప్రధాని మోదీ అభినందనలు
అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్‌నకు ప్రధాని మోదీ శుభాంక్షలు తెలిపారు. నా ప్రియ మిత్రుడికి హృదయపూర్వక అభినందనలు మిత్రమా అంటూ ట్వీట్ చేశారు.
BY Vamshi Kotas6 Nov 2024 2:53 PM IST

X
Vamshi Kotas Updated On: 6 Nov 2024 2:55 PM IST
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రెండోసారి గెలుపొందిన 47వ అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌కు ప్రధాని మోదీ శుభాంక్షలు తెలిపారు. చరిత్రాత్మక విజయం పొందిన నా ప్రియ మిత్రుడికి హృదయపూర్వక అభినందనలు మిత్రమా అంటూ ట్వీట్ చేశారు. పరస్పర సహకారంలో భారత్-యూఎస్ మరింత బలోపేతం చేద్దామని తెలిపారు.
మరింత బలోపేతం చేసుకోవడం కోసం మన సంబంధాలకు పునరుజ్జీవం కల్పించడంపై దృష్టి సారిద్దాం. మన ఇరు దేశాల ప్రజల జీవితాలను మెరుగుపర్చేందుకు, ప్రపంచశాంతి వికాసానికి, స్థిరత్వానికి, శ్రేయస్సు కోసం కలసికట్టుగా పాటుపడదాం" అంటూ మోదీ ట్వీట్ చేశారు. ప్రపంచ శాంతి, సుస్థిరత్వం, శ్రేయస్సు కోసం పాటుపడదాం’’ అని ఆ పోస్టులో రాసుకొచ్చారు. అలాగే గతంలో పలు వేదికల్లో ఇద్దరు కలిసి దిగిన చిత్రాలను పంచుకున్నారు.
Next Story