National
న్యూ అడాప్టివ్ టెక్ ఫార్వర్డ్ లైఫ్ స్టైల్ (అట్లాస్) ఆర్కిటెక్చర్ ఆధారంగా నిర్మించిన ఐసీఈ మోడల్ కారు టాటా కర్వ్ నాలుగు వేరియంట్లు – ఎకంప్లిష్డ్, క్రియేటివ్, ప్యూర్, స్మార్ట్ వేరియంట్లలో లభిస్తుంది.
రెజ్లింగ్, షూటింగ్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్‌ల్లో భారత జట్టులో మహిళలపైనే పతక ఆశలు ఎక్కువగా ఉండడం విశేషం.
సిసోదియా బెయిల్ నేపథ్యంలో కవిత బెయిల్ విషయంలో సానుకూల తీర్పు వస్తుందని బీఆర్ఎస్ శ్రేణులు అంచనా వేస్తున్నాయి.
టార్చ్‌కి బ్యాటరీని కనెక్ట్ చేయడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు చిన్నారులకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి ఆ చిన్నారులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
దౌత్యవేత్తలు మాత్రం బంగ్లాలోనే ఉంటారని, దౌత్య కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే తాజాగా వీసా సెంటర్లను మూసివేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
వారి అరుపులు విన్న కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చి చూసేసరికి లిఖిత రక్తపు మడుగులో పడి ఉంది. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది. నవీన్ కూడా తీవ్ర గాయాలపాలై ఉండటంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు.
సీపీఎం పొలిట్‌బ్యూరోలో కీలకంగా వ్యవహరించిన బుద్ధదేవ్.. సుదీర్ఘకాలం పాటు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కమ్యూనిస్టు యోధుడు జ్యోతిబసు తర్వాత 2000 సంవత్సరంలో బెంగాల్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
ఇవాళ ఉదయం ఆమె బరువు పెరిగినట్లు గుర్తించిన ఒలింపిక్స్ కమిటీ ఆమెపై వేటు వేసినట్లు తెలుస్తోంది. భారత అధికారులు విజ్ఞప్తి చేసినప్పటికీ ఒలింపిక్స్ కమిటీ అంగీకరించలేదని సమాచారం.
ఈ కేసు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ఈ ఉత్తర్వులు జారీ చేస్తూ కోచింగ్ సెంటర్లపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సుప్రీంకోర్టు గురువారం ఇచ్చిన తీర్పులో స్పష్టం చేసిన విషయం తెలిసిందే.