పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్ష ఎంపీలు నిరసన
కేంద్రమంత్రి అమిత్‌షా అంబేద్కర్‌ను అవమానించారని పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్ష ఎంపీలు నిరసన తెలిపారు.
పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్ష ఎంపీలు నిరసనకు దిగారు. బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటాలను పట్టుకొని కేంద్రమంత్రి అమిత్‌షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిన్న రాజ్యసభలో రాజ్యాంగం మీద జరిగిన డిబినేట్‌లో అమిత్‌షా తన ప్రసంగంలో అంబేద్కర్‌ను అవమానించారని వారు ఆరోపించార. లోక్ సభలో కాంగ్రెస్ నేత రాహూల్ గాంధీ, ప్రియాంకా గాంధీ తదితరులు పాల్గొని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో గరిష్ఠ వాణిజ్య లోటు నమోదవ్వడంపై రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. రికార్డు స్థాయిలో గరిష్ఠ వాణిజ్య లోటు, అధిక వడ్డీ రేట్లు పెరుగుతాయని తెలిపారు. ఈకారణంగా వస్తువుల వినియోగం తగ్గి ద్రవ్యోల్బణం పెరుగుదల వంటివన్నీ చూస్తామని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
దేశంలో వాణిజ్య లోటు, దిగుమతులు గతంలో ఎన్నడూ లేనంతగా ఉన్నాయని వస్తున్న వార్తా కథనాలను ఉటంకిస్తూ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రభుత్వాలు ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాలకు ప్రాధాన్యమిస్తే ఇలాకాక ఇంకేం జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. వాణిజ్య మంత్రిత్వశాఖ డేటా ప్రకారం.. నవంబరులో దేశీయ వాణిజ్య ఎగుమతులు ఏడాదిక్రితం ఇదే నెలతో పోలిస్తే 4.85% తగ్గి 32.11 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఇదే సమయంలో దిగుమతులు 27% పెరిగి రికార్డు స్థాయి 69.95 బిలియన్ డాలర్లకు చేరాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.