Telugu Global
National

ఆదానీ వ్యవహారంపై పార్లమెంట్‌లో విపక్ష ఎంపీల నిరసన

పార్లమెంట్ శీతాకాల సమావేశాలో ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన చేపట్టాయి.

ఆదానీ వ్యవహారంపై పార్లమెంట్‌లో విపక్ష ఎంపీల నిరసన
X

పార్లమెంట్ శీతాకాల సమావేశాలో ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన చేపట్టాయి. అదానీ వ్యవహారంపై లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ సహా విపక్ష ఎంపీలంతా నిరసనకు దిగారు. ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. అయితే, ఈ నిరసనలకు తృణమూల్‌ కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీలు హాజరుకాలేదు. ఇవాళ పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి.ఉభయ సభల్లో పలు అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయి. అయితే, సభ ప్రారంభమైన కొద్ది సేపటికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్ష ఎంపీలు వేర్వేరు అంశాలను లేవనెత్తడంతో స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

లోక్‌సభను మధ్యాహ్నం 12గంటల వరకు వాయిదా వేశారు. మరోవైపు రాజ్య సభలో సైతం ప్రతిపక్ష నేతలు ఆందోళన కొనసాగుతుంది. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధనఖడ్‌, కాంగ్రెస్‌ ఎంపీ జైరాం రమేష్ మధ్య వాగ్వాదం జరిగింది. సభాసంప్రదాయాలను పక్కన పెట్టి జగదీప్‌ ధనఖడ్‌ ఏకపక్షంగా వ్యహరిస్తున్నారని మండిపడ్డారు. జైరాం రమేష్‌ వ్యాఖ్యలపై జగదీప్‌ ధనఖడ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను మద్యాహ్నం 1 గంట వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.ఉభసభ సమావేశాల్లో ఇవాళ మూడు బిల్లులకు సభ ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వాటిల్లో 2024 రైల్వే బిల్లు (సవరణ) , 2024 విపత్తు నిర్వహణ బిల్లు (సవరణ), 2024 బ్యాంకింగ్ చట్టాల బిల్లు (సవరణ)లు ఉన్నాయి.

First Published:  9 Dec 2024 12:44 PM IST
Next Story