సోనియా గాంధీకి సభా హక్కుల ఉల్లంఘన నోటీసు
కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియా గాంధీపై బీజేపీ ఎంపీలు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు.
కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియాగాంధీపై బీజేపీ ఎంపీలు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. పార్లమెంట్ ఉభయ సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగన్నిఉద్దేశిస్తూ సోనియాగాంధీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని అందులో పేర్కొన్నారు. భారత రాష్ట్రపతికి వ్యతిరేకంగా రాజ్యసభ ఎంపీ సోనియాగాంధీ చేసిన కొన్ని వ్యాఖ్యలు రాష్ట్రపతి స్థాయి, ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ అంశానికి ఉన్న తీవ్రతను పరిగణనలోకి తీసుకుని ఆమెపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి'' అని బీజేపీ ఎంపీలు రాజ్యసభ చైర్మన్‌ను కోరారు. సోనియాగాంధీ కామెంట్స్ గిరిజన వ్యతిరేక భావజాలంతో కూడుకున్నాయని ఎంపీలు ఆరోపించారు. పార్లమెంటు పవిత్రత, నిబంధనల పరిరక్షణకు, ప్రజాస్వామ్య సంస్థలు సమర్ధవంతంగా పనిచేసేందుకు క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని రాజ్యసభ చైర్మన్‌ను కోరారు.
రాష్ట్రపతి తన ప్రసంగన్ని చివరి వరకు కొనసాగించలేకపోయారని, అలసిపోయారని పూర్ అంటూ కామెంట్ చేశారు. దీంతో ఇది వివాదాస్పదంగా మారింది. సోనియా గాంధీ కామెంట్స్ ను రాష్ట్రపతి కార్యాలయం ఖండించింది. ఆమె చేసిన వ్యాఖ్యలు.. రాష్ట్రపతి పదవికి ఉన్న గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని వెల్లడించింది.అటు ప్రధాని మోదీ కూడా తీవ్ర విమర్శలు చేశారు. మొట్ట మొదటి గిరిజన మహిళా రాష్ట్రపతిని, ఓ సాధారణ మహిళలను ప్రత్యక్షంగా అవమానించడమేనంటూ మండిపడ్డారు. రాష్ట్రపతి పట్ల కాంగ్రెస్ అహంకారం, అగౌరవాన్ని ప్రదర్శిస్తోందని ఆరోపించారు. బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లా కోర్టులో సోనియా గాంధీ వ్యాఖ్యలపై ఫిర్యాదు దాఖలైంది. ముజఫర్‌పూర్‌కు చెందిన సుధీర్ ఓజా అనే న్యాయవాది శనివారం గాంధీపై ఫిర్యాదు చేశారు, దేశ అత్యున్నత రాజ్యాంగ అధికారాన్ని అగౌరవపరిచినందుకు ఆమెపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరారు.