ఢిల్లీలో భారీ పేలుడు
ఢిల్లీలో పేలుడు కలకలం రేపింది. రోహిణీ జిల్లా ప్రశాంత్ విహార్ ప్రాంతంలోని సీఆర్‌పీఎఫ్ పాఠశాల సమీపంలో పేలుడు సంభవించింది.
BY Vamshi Kotas20 Oct 2024 11:34 AM IST

X
Vamshi Kotas Updated On: 20 Oct 2024 11:34 AM IST
దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభంవించింది. రోహిణీ ప్రాంతంలోని సీఆర్‌పీఎఫ్ స్కూల్ వద్ద భారీ పేలుడు శబ్ధం రావడంతో స్థానికంగా భయాందోళనకు గురయ్యారు. స్కూల్ సరిహద్దు గోడ దగ్గర పేలుడు జరిగినట్టు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం అధికారులు ఆ ప్రాంతంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఎఫ్‌ఎస్‌ఎల్ టీమ్, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌లు తనిఖీలు చేపట్టాయి.
పేలుడు జరిగిన వెంటనే ఆ ప్రాంతంలో భారీగా పొగ వెలువడినట్టు స్థానికులు తెలిపారు. ఘటనకు గల కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు. అయితే పేలుడు వల్ల స్కూల్‌కి ఎటువంటి నష్టం వాటిల్లలేదని తెలుస్తోంది. పేలుడు ధాటికి సమీపంలోని వాహనాలు దెబ్బతిన్నట్టు తెలుస్తోంది.
Next Story