మహాకుంభమేళాలో ముకేశ్ అంబానీ ఫ్యామిలీ
మహాకుంభమేళాకు వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ కుటుంబ సమేతంగా వెళ్లారు.
![మహాకుంభమేళాలో ముకేశ్ అంబానీ ఫ్యామిలీ మహాకుంభమేళాలో ముకేశ్ అంబానీ ఫ్యామిలీ](https://www.teluguglobal.com/h-upload/2025/02/11/1402517-mukesh-ambani-kumbh-mela-2.webp)
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా కొనసాగుతోంది. రోజులు గడుస్తున్నా ఈ కార్యక్రమానికి కోట్లాది మంది భక్తులు ఇంకా తరలివస్తున్నారు. తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ కుటుంబ సమేతంగా వెళ్లారు. కుటుంబంతో కలిసి బోట్ రైడ్ చేశారు. త్రివేణి సంగమానికి చేరుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇప్పటికే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోల్డ్‌ప్లే సింగర్ క్రిస్ మార్టిన్ సహా పలువురు ప్రముఖులు ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించారు.
![](https://www.teluguglobal.com/h-upload/2025/02/11/1402518-mukesh-ambani-kumbh-mela-1.webp)
తాజాగా అంబానీ కుటుంబం ఈ ఆధ్యాత్మిక వేడుకకు విచ్చేశారు. కాగా.. మాఘ పూర్ణిమతో పాటు ఇంకొన్ని రోజుల్లో కుంభమేళా పూర్తికావొస్తుండటంతో ప్రయాగ్‌రాజ్‌కు భారీగా భక్తులు తరలిరానున్నారు. భక్తుల తాకిడికి 350 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్, సివనీ, కట్నీ, మైహర్, సాత్నా, రివా జిల్లాల్లో భారీగా ట్రాఫిక్ జామ్‌లు అవుతున్నాయి. 50 కి.మీ. మేర దూరం వెళ్లడానికే 10 నుంచి 12 గంటల సమయం పడుతుందని ప్రయాణికులు వాపోతున్నారు. పరిస్థితి అదుపు చేసేందుకు అధికారులు ఆంక్షలు అమలు చేస్తున్నారు.