జమిలి ఎన్నికల జేపీసీకి ఛైర్‌పర్సన్‌గా ఎంపీ పీపీ చౌదరి
జమిలి ఎన్నికల జేపీసీకి ఛైర్‌పర్సన్‌గా ఎంపీ పీపీ చౌదరి నియమితులయ్యారు.
BY Vamshi Kotas20 Dec 2024 9:15 PM IST
X
Vamshi Kotas Updated On: 20 Dec 2024 9:15 PM IST
వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుపై ఏర్పాటైన జాయింట్ పార్లమెంట్ కమిటీకి ఛైర్మన్‌గా బీజేపీ ఎంపీ పీపీ చౌదరి నియమితులయ్యారు. ఈ విషయాన్ని లోక్‌సభ సెక్రటేరియట్ ఇవాళ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా జమిలి ఎన్నికల ఒకేసారి నిర్వహించేందుకు ఉద్దేశించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లుపై అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం జేపీసీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీలో సభ్యుల సంఖ్యను గురువారం 31 నుంచి 39కి పెంచారు. దీని ప్రకారం లోక్‌సభ నుంచి 27 మంది ఎంపీలు, రాజ్యసభ నుంచి 12 మంది చొప్పున ఉంటారు.
Next Story