శ్రీనగర్‌లో పంజా విసురుతున్న చలిపులి
మైనస్ 2 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత
BY Naveen Kamera4 Dec 2024 3:21 PM IST
X
Naveen Kamera Updated On: 4 Dec 2024 3:21 PM IST
అసలే చలికాలం. ఆపై మంచుకొండలు.. ఇంకేముంది శ్రీనగర్‌లో చలిపులి పంజా విసురుతోంది. ఈ ఏడాది శీతాకాలంలో తొలిసారిగా కనిష్ట ఉష్ణోగ్రత మైనస్ 2 డిగ్రీల సెల్సీయస్‌గా నమోదయింది. మంగళవారం మైనస్ 1.8 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రత నమోదవగా, బుధవారం అంతకన్నా 0.2 డిగ్రీలు పడిపోయి మైనస్ 2 డిగ్రీల సెల్సీయస్‌గా రికార్డు అయ్యింది. దక్షిణ కశ్మీర్ లోయకె గేట్ వే టౌన్‌గా పేర్కొనే ఖాజీగుండ్‌లో బుధవారం కనిష్ట ఉష్ణోగ్రత మైనస్ 2.2 డిగ్రీలుగా నమోదు అయ్యింది. జనవరిలో ఇంకా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోనున్నాయి.
Next Story