మహిళల బట్టలు పురుషులు కుట్టకూడదు : యూపీ మహిళా కమిషన్
యూపీ మహిళా కమిషన్ కీలక ప్రతిపాదనలు చేసింది. బ్యాడ్ టచ్’ నుంచి మహిళలను రక్షించేందుకు మహిళల దుస్తులను పురుషులు కుట్టకూడదని కమిషన్ సూచించింది.
BY Vamshi Kotas8 Nov 2024 9:32 AM GMT
X
Vamshi Kotas Updated On: 8 Nov 2024 9:32 AM GMT
యూపీ మహిళా కమిషన్ కీలక ప్రతిపాదనలు చేసింది. బ్యాడ్ టచ్’ నుంచి మహిళలను రక్షించేందుకు మహిళల దుస్తులను పురుషులు కుట్టకూడదని కమిషన్ సూచించింది. స్త్రీల దుస్తుల కొలతలు మహిళల మాత్రమే తీసుకోవాలని ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని తెలిపింది. స్త్రీలను రక్షించేందుకు ఈ చర్యలని ఉమె కమిషన్ సభ్యురాలు హిమానీ అగర్వాల్ తెలిపారు.
మహిళా శిరోజాలను పురుషులు కత్తిరించకుండా, స్త్రీలే కత్తిరించేలా చర్యలు తీసుకోవాలని యూపీ సర్కార్ ప్రతిపాదించింది..ప్రస్తుతం తాము ప్రతిపాదనలు మాత్రమే చేశామని, త్వరలోనే వీటిని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించనున్నట్లు తెలిపారు. ఈ నిబంధనలను కఠినంగా అమలు చేసేందుకు చట్టం తీసుకొచ్చేలా యూపీ ప్రభుత్వాన్ని కోరనున్నట్లు పేర్కొన్నారు. ఏదేమైనా ప్రస్తుతం ఈ ప్రతిపాదనల అంశం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
Next Story