Telugu Global
National

మహారాష్ట్ర పీసీసీ చీఫ్ నానా పటోలే రాజీనామా

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ పీసీసీ చీఫ్ నానా పటోలే రాజీనామా చేశారు.

మహారాష్ట్ర పీసీసీ చీఫ్ నానా పటోలే రాజీనామా
X

మహారాష్ట్ర పీసీసీ చీఫ్ నానా పటోలే రాజీనామా చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ లేఖను హైకమాండ్‌కు పంపించారు. ఈ సాయంత్రం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలవనున్నారు. 2021లో నానా పటోలే మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో.. ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పోటీ చేసిన 17 ఎంపీ స్థానాలకు గాను 13 స్థానాలను గెలుచుకొని, మంచి ప్రదర్శన కనబరిచింది. మహారాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో మొత్తం 288 సీట్లు ఉండగా.. మహాయుతి కూటమి 233 స్థానాల్లో గెలుపొందింది. అటు ప్రతిపక్ష మహావికాస్‌ అఘాడీ కూటమి 51 చోట్ల విజయం సాధించింది. కూటమిలో భాగంగా 101 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్‌ కేవలం 16 స్థానాలు మాత్రమే గెలుచుకోవడంతో పార్టీకి పెద్ద ఎదురుదెబ్బే తగిలింది. మహారాష్ట్ర ఏర్పడిన నాటినుంచి ఎన్నడూ లేనంత బలహీనంగా కాంగ్రెస్‌ మారిపోయింది.

First Published:  25 Nov 2024 11:38 AM IST
Next Story