మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికలు..రూ 558 కోట్లు పట్టివేత
మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో నేపధ్యంలో ఎన్నికల అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు.
మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ నగదును ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నవంబర్ 6వరకు మొత్తంగా రూ.558.67 కోట్లు విలువైన నగదు, ఇతర తాయిలాలను సీజ్ చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. సీజ్ చేసిన దాంట్లో రూ.92.47 కోట్లు నగదు కాగా.. రూ.52.76 కోట్ల విలువ చేసే మద్యం, రూ.68.22 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు, రూ.104.18 కోట్ల విలువైన ఆభరణాలు, రూ.241.02 కోట్ల విలువైన ఉచితాలు, ఇతర వస్తువులు ఉన్నట్లు పేర్కొంది.
కోట్లుఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు పలు రాజకీయ పార్టీలు చేసే ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసేందుకు ఎలక్షన్ కమీషన్ చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికలు జరగనున్న రెండు లోక్‌సభ సీట్లు, 48 అసెంబ్లీ స్థానాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపడుతోంది. మహారాష్ట్రలో నవంబర్ 20న ఎన్నికలు జరగనుండగా.. ఝార్ఖండ్‌లో నవంబర్ 13న తొలి విడత, నవంబర్ 20న రెండో విడత పోలింగ్ జరగనుంది