కేంద్రమంత్రి నిర్మాలా వ్యాఖ్యలపై ఖర్గే ఫైర్
మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూపై విమర్శలు చేసిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, భాజపాపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే విరుచుకుపడ్డారు.
మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూపై విమర్శలు చేసిన కేంద్రమంత్రి ఆర్థిక మంత్రి నిర్మాలా సీతరామన్, బీజేపీ పై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. జేఎన్‌యూ నుంచి పట్టభద్రురాలు, ఆర్థిక నిపుణురాలు కావొచ్చు గానీ.. ఆమె చర్యలు మాత్రం బాగాలేవంటూ విమర్శించారు. బీజేపీ దేశ విభజన సూత్రాన్ని నమ్ముతోందని వారి పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని దుయ్యబట్టారు. కుటుంబం కోసం నిస్సంకోచంగా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగానికి కీలక సవరణలు చేసిందని నిర్మాలా విమర్శించారు.
సంకీర్ణ భాగస్వామ్య పక్షాల ఒత్తిడితో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించినందుకు కాంగ్రెస్ పార్టీని 'మహిళా వ్యతిరేకి' అని ఆమె అభివర్ణించారు. 50 ఏళ్ల పాటు గత కాంగ్రెస్ ప్రభుత్వాల ఆర్థిక విధానాలు భారత ఆర్థికవ్యవస్థను బలోపేతం చేయలేదన్నారు. ప్రతిసారీ కాంగ్రెస్ ఎలాంటి బెదురు లేకుండా కుటుంబం కోసమే రాజ్యాంగాన్ని సవరించింది. రెండో ప్రపంచయుద్ధం అనంతరం 50 దేశాలకు స్వాతంత్ర్యం దక్కింది. ఆయా దేశాలు రాజ్యాంగాన్ని రచించుకున్నాయి. ఆ తర్వాత అనేక దేశాలు తమ రాజ్యాంగ ఉద్దేశాన్ని మార్చుకున్నాయి. కానీ భారత రాజ్యాంగం అనేక పరీక్షలు ఎదుర్కొని నిలబడింది. కాంగ్రెస్ పాలనలో వాక్ స్వానత్ర్యాన్ని అణచేందుకు సవరణలు చేసింది. ఇప్పుడు రాజ్యాంగ పరిరక్షణ అంటూ ప్రసంగాలు చేస్తోందని నిర్మలా సీతారామన్ ఘాటుగా విమర్శలు చేశారు.