Telugu Global
National

ఈ నెల 22న కర్ణాటక బంద్‌ ఎందుకంటే?

మరాఠీ మాట్లాడలేదని కన్నడ కండక్టర్‌పై దాడి ఘటనలను ఖండిస్తూ మార్చి 22న కన్నడ సంఘాలు రాష్ట్రబంద్‌కు పిలుపునిచ్చాయి.

ఈ నెల 22న కర్ణాటక బంద్‌ ఎందుకంటే?
X

మహారాష్ట్రలో కేఎస్ఆర్టీసీ సిబ్బందిపై దాడి కన్నడ బస్సులకు రంగులు వేయడం, బెళగావిలో మరాఠీ మాట్లాడలేదని కండక్టర్‌పై దాడి ఘటనలను ఖండిస్తూ మార్చి 22న కన్నడ సంఘాలు రాష్ట్రబంద్‌కు పిలుపునిచ్చాయి. మార్చి 7న బెళగావి ఛలో కార్యక్రమం నిర్వహిస్తున్నామని, 11న అత్తిబెలె సరిహద్దును బంద్‌ చేస్తామని, 16న హొస్కోటె టోల్‌ బంద్‌ చేస్తామని తెలిపారు. 22న కర్ణాటక బంద్‌కు పిలుపునిచ్చామని అన్నారు. కన్నడ సంఘాల ఐక్యకూటమి అధ్యక్షుడు వాటాళ్‌ నాగరాజ్‌.. ఇవాళ కన్నడ సంఘాల ముఖ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటకలోనే కన్నడిగులను వేధించడం, మహారాష్ట్రకు వెళ్లే బస్సులు, సిబ్బందిపై దాడి చేయడాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పారు. బెంగళూరులో భారీ ర్యాలీ నిర్వహించేందుకు తీర్మానించామని ఆయన చెప్పారు. టౌన్‌హాల్‌ నుంచి ఫ్రీడం పార్కు దాకా ర్యాలీ కొనసాగుతుందన్నారు. బంద్‌కు అన్ని ప్రజాసంఘాలు, కార్మిక సంఘాల మద్దతు కోరామని, అందరూ మద్దతు తెలిపారని చెప్పారు. ముఖ్య నాయకులు ప్రవీణ్‌శెట్టి, గోవిందు, కేసీ కుమార్‌ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. అయితే కర్ణాటక రక్షణ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు నారాయణగౌడ.. రాష్ట్ర బంద్‌కు తమ మద్దతు తెలుపడం లేదని తెలిపారు

First Published:  1 March 2025 9:05 PM IST
Next Story